Bandla Ganesh: బండ్ల గణేష్. నటుడిగా.. నిర్మాతగా అలరిస్తున్నాడు. ఈయన చురుగ్గా సినిమాలు నిర్మించకపోయినా ప్రజల్లో కావాల్సినంత క్రేజ్ ఉంది. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి పాపులర్ అయ్యాడు. అనంతరం అస్త్ర సన్యాసం చేసి ఇప్పుడు నటనతోపాటు ఆడియో ఫంక్షన్లలో అలరిస్తున్నాడు. ఈ ఫంక్షన్లలో బండ్ల గణేష్ వివాదాస్పద ప్రకటనలు.. నాటకీయ ప్రసంగాలు అతన్ని అన్నిటికంటే ఎక్కువ పాపులర్ చేశాయి. అయితే బండ్ల గణేష్ పూర్తి కమర్షియల్ అని తాజాగా తేలింది. తన మాట సాయానికి కూడా పైసలు వసూలు చేస్తాడని విచారణలో తేలింది.
పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బండ్ల గణేష్ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారారు. కొన్ని సినిమాల్లోనూ హీరోగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉన్నాడు. అయితే బండ్ల ఎప్పుడూ ఉచితంగా ఏమీ చేయడు. తాజాగా ఓ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పమని ఓ దర్శకుడు అతడిని సంప్రదించాడు. దీనికి బండ్ల ఇంత కావాలంటూ సమాధానం చెప్పడంతో దర్శకుడు మళ్లీ ఫోన్ చేయలేదు.
Also Read: Forbes India- Syed Hafeez: ఫోర్బ్స్ ఇండియా’లో గోదావరి‘ఖని’జం.. సయ్య హఫీజ్‌కు అరుదైన గుర్తింపు!
చాలాకాలం తర్వాత వేణు తొట్టెంపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో మళ్లీ నటిస్తున్నారు. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పమని బండ్ల గణేష్‌ని దర్శకుడు శరత్ మండవ కోరాడు. ఓకే చెప్పి ప్రొడక్షన్ టీమ్ ని టచ్ లోకి రావాల్సిందిగా కోరాడు. వారు అతనిని సంప్రదించగా బండ్ల రూ.5 లక్షలు రెమ్యునరేషన్ అడిగాడు. దీనికి చిత్రం యూనిట్ షాక్ తిని.. బండ్లను డబ్బింగ్ కు తిరిగి పిలవకుండా కామ్ అయిపోయిందట.
నిజానికి బండ్ల గణేష్ వాయిస్ నటుడు వేణు తొట్టెంపూడికి ఎలా సూట్ అవుతుందో.. దర్శకుడు ఎలా భావించాడో ఎవరికీ తెలియదు. బహుశా అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అని అతను భావించి ఉండవచ్చు. మరోవైపు ఈ పరిమాణంతో చిత్రయూనిట్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిజం చెప్పాలంటే బండ్లగణేష్ వాయిస్ కు రూ.5 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. బండ్ల కోట్ చేసిన ధర నిజంగా అతీతమైనది కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అతడి వాయిస్ నే కావాలంటే ఆమాత్రం ఇవ్వొచ్చని అంటున్నారు. బండ్ల గణేష్ గాత్రానికే రూ.5 లక్షలు అడిగాడంటే ఇక నటుడిగా ఇంకెంత వసూలు చేస్తున్నాడోనని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
Also Read:Rama Rao On Duty Theaters: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేటర్స్ లిస్ట్ ఇదే