https://oktelugu.com/

Bandla Ganesh: తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇష్టమైన వ్యక్తులు వీరే అంటున్న… బండ్ల గణేష్

Bandla Ganesh:  టాలీవుడ్ లో బండ్ల గణేశ్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు కమెడియన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయ మయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా పేరు పొందారు బండ్ల. అలానే త్వరలో హీరోగా మనందరి ముందుకు రానున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల లోనూ, ఫంక్షన్ ల లోనూ ఆయన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారంటే అతి శయోక్తి కాదు. కాగా ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల‌లో త‌న‌కు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 09:51 AM IST
    Follow us on

    Bandla Ganesh:  టాలీవుడ్ లో బండ్ల గణేశ్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు కమెడియన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయ మయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా పేరు పొందారు బండ్ల. అలానే త్వరలో హీరోగా మనందరి ముందుకు రానున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల లోనూ, ఫంక్షన్ ల లోనూ ఆయన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారంటే అతి శయోక్తి కాదు. కాగా ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల‌లో త‌న‌కు ఇష్టమైన వారు వీరే అంటూ బండ్ల గ‌ణేష్ ట్వీట్ట‌ర్ లో ఫోటోల‌ను షేర్ చేశాడు.

    అలాగే ‘నాకు తెలిసిన‌ నాకిష్ట‌మైన తెలుగు జాతి ర‌త్నాలు వీరే’ అనే క్యాప్ష‌న్ ను కూడా ఉంచాడు. ఈ పోస్టులో మెగాస్టార్ చిరంజీవి, ఈనాడు అధినేత రామోజీ రావు, తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్య మంత్రులు నంద‌మూరి తార‌క రామారావు, వైఎస్ రాజ‌శేఖర్ రెడ్డి, చంద్రబాబు ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు, సుప్రీం కోర్టు సీజేఐ ఎస్వీ ర‌మ‌ణ అని తెలిపాడు. వీరి ఫోటోల‌ను కూడా బండ్ల గ‌ణేష్ పోస్టు చేశాడు. అయితే బండ్ల గ‌ణేష్ చేసిన ట్విట్ పట్ల నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ డేగల బాబ్జీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతుంది. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక్కటే చెప్పు సైజ్ 7) తమిళ సినిమాకు ఇది రీమేక్ వెర్షన్.

    https://twitter.com/ganeshbandla/status/1469200457444720640?s=20