Bandla Ganesh Comments on Pan India Heroes: కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని జనాల్లో ఏర్పాటు చేసుకున్న వారిలో ఒకరు బండ్ల గణేష్(Bandla Ganesh). మెయిన్ క్యారెక్టర్స్ ఇప్పటి వరకు ఆయన చేయకపోయినప్పటికీ, ఒక కమెడియన్ గా మాత్రం జనాలకు గుర్తుండిపోయేలా అయితే చేసుకున్నాడు. ఒక సాధారణ కమెడియన్ గా కొనసాగే బండ్ల గణేష్, అకస్మాత్తుగా నిర్మాతగా మారి రవి తేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో చెరో రెండు సినిమాలు చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. బండ్ల గణేష్ కి బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ఉందిగా?, మామూలోడు కాదండోయ్ అంటూ ప్రతీ ఒక్కరు ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే బండ్ల గణేష్ ప్రముఖ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ కి బినామీ అని, ఆయన కారణంగానే నిర్మాత అయ్యాడని కొన్ని ఆరోపణలు ఉన్నాయి.
Also Read: రిస్కీ స్టోరీ లైన్ తో రామ్ చరణ్,సుకుమార్ మూవీ..ఇలా అయితే కష్టమే!
కానీ బండ్ల గణేష్ వాటికి సమాధానం చెప్తూ ‘నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ని, మాకు పౌల్ట్రీ ప్రొడక్షన్ ఫామ్ ఉంది, హైదరాబాద్ లో జనాలు తినే గుడ్లు మా ఫామ్ నుండే అత్యధిక శాతం వస్తాయి. సినిమాల్లో కమెడియన్ గా చేస్తున్నాను కదా అని నన్ను తక్కువ అంచనా వేయొద్దు, నాకు సినిమాల మీదున్న మక్కువ కారణంగానే చేస్తున్నాను కానీ, నాకు అసలు చెయ్యాల్సిన అవసరమే లేదు’ అంటూ ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈమధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ,బండ్ల గణేష్ జోరు బాగా తగ్గింది. రాజకీయ పరంగా యాక్టీవ్ గా కొన్ని రోజులు అయితే ఉన్నాడు కానీ, సినీ నటుడిగా, నిర్మాతగా మాత్రం చాలా కాలం నుండి యాక్టీవ్ గా ఉండడం లేదు బండ్ల గణేష్. సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు.
Also Read: ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..
అయితే రీసెంట్ గానే ప్రముఖ సీనియర్ డైరెక్టర్ SV కృష్ణా రెడ్డి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 32 ఏళ్ళు అయ్యింది. ఈ 32 ఏళ్లలో ఆయన 42 సినిమాలు చేశాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ కి బండ్ల గణేష్ ఒక అతిధిగా పాల్గొని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి . ఆయన మాట్లాడుతూ ‘ఒక్కొక్క హీరో నాలుగేళ్ల పాటు సినిమాలు చెయ్యడం ఏంటి?, ఒక థియేటర్ ఓనర్ గా చెప్తున్నాను, ఎంతో నష్టపోతున్నామో తెలుసా. మొన్న మా థియేటర్ కి వెళ్లి బ్యాలన్స్ షీట్ చూస్తే 40 లక్షలు నష్టం ఉంది. ఒకప్పుడు థియేటర్స్ నుండి ఎంత లాభాల వచ్చేవి, ఇప్పుడు ఎలాంటి వసూళ్లు వస్తున్నాయి’ అంటూ చాలా భావోద్వేగ పూరిత మాటలు మాట్లాడాడు.