https://oktelugu.com/

బ్రేకింగ్ : భక్తుడితో  పవన్ కొత్త సినిమా !

  పవర్ స్టార్  ప‌వ‌న్ కళ్యాణ్ కు అభిమానులు  ఎంతమంది  ఉన్నా….  పవన్ కి పరమభక్తుడు మాత్రం బండ్ల గ‌ణేష్ నే.  బండ్లకు పవర్ స్టార్ తో ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో కల ఉంది. ఆ కల కోసం సైలెంట్ గా గత కొన్ని నెలలుగా  పవన్ ను ఒప్పించడానికి  బండ్ల ముమ్మరంగానే  ప్రయత్నాలు చేస్తున్నాడు.  అయితే పవన్ కళ్యాణ్  ఇప్పటికే వేరే నిర్మాతలతో మూడు సినిమాలు కమిట్ అవ్వడం వల్ల.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 28, 2020 / 02:17 PM IST
    Follow us on

     
    పవర్ స్టార్  ప‌వ‌న్ కళ్యాణ్ కు అభిమానులు  ఎంతమంది  ఉన్నా….  పవన్ కి పరమభక్తుడు మాత్రం బండ్ల గ‌ణేష్ నే.  బండ్లకు పవర్ స్టార్ తో ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో కల ఉంది. ఆ కల కోసం సైలెంట్ గా గత కొన్ని నెలలుగా  పవన్ ను ఒప్పించడానికి  బండ్ల ముమ్మరంగానే  ప్రయత్నాలు చేస్తున్నాడు.  అయితే పవన్ కళ్యాణ్  ఇప్పటికే వేరే నిర్మాతలతో మూడు సినిమాలు కమిట్ అవ్వడం వల్ల.. బండ్లకు గత సంవత్సరం నుండి ఓకే చెప్పలేదు. అయినా పట్టు వదలకుండా పవన్ చుట్టూ తిరుగుతున్న బండ్ల తపనను చూసిన  పవన్, మొత్తానికి అవకాశం ఇచ్చాడు.  బండ్ల గ‌ణేష్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘నా బాస్ సరే అన్నారు. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌ కళ్యాణ్ కి ధన్యవాదాలు’ అంటూ బండ్ల పోస్ట్ చేశారు.  
    Also Read : విజయ్ దేవరకొండతో  ‘సుకుమార్’ పాన్ ఇండియా మూవీ !    


    ఇక ఇప్పటికే బండ్ల ఓ స్టార్ డైరెక్టర్ ను కూడా సంప్రదించాడట. ఎలాగూ కాంబినేషన్ లను సెట్ చేసి.. సినిమాలను తీయడంలో బండ్లకు బట్టర్ తో పెట్టిన విద్య కాబట్టి.. ఏదోకటి చేసి ఎవర్నో ఒక స్టార్ డైరెక్టర్ ను ఒప్పిస్తాడు. పైగా పవన్ కళ్యాణ్ హీరో.. సో.. ఖాళీ లేకపోయినా  ఏ స్టార్ డైరెక్టర్ అయినా డేట్స్ ఎడ్జెస్ట్ చేసి మరీ సినిమా చేస్తాడు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట ప్రకారం  ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ – పరుశురామ్ కాంబినేషన్ లో  బండ్ల గ‌ణేష్ సినిమా ప్లాన్ చేసాడని..  ‘సర్కారు వారి పాట’ పూర్తవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.

    https://twitter.com/ganeshbandla/status/1310457517302935553

    మొత్తానికి పవన్ ఇప్పటికే వరుస సినిమాలు అంగీకరించి.. ఇక సినిమాలు చేయనని బండ్లకి చెప్పినా..  బండ్ల మాత్రం తన వంతుగా  తన ప్ర‌య‌త్నాలు చేసి మరీ పవన్ ను ఒప్పించాడు. అన్నట్లు పవర్ స్టార్ కి 60 కోట్ల రూపాయ‌ల‌ రెమ్యునేష‌న్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఇతర నటీనటుల రెమ్యున‌రేష‌న్ ల రూపంలో మరో 10 కోట్లు పోగా ఎలాగోలా సినిమాను మరో 40కోట్ల‌లో పూర్తి చేసేసి.. మొత్తానికి  సినిమాను 170 కోట్లకు బిజినెస్ చేసుకోవాలనేది బండ్ల గణేష్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి మనోడి ప్లాన్ ఎంతవరకు  వర్కౌట్ అవుతుందో చూడాలి.

    Also Read : ఎస్పీ బాలు ఆసుపత్రి బిల్లుపై వివాదం.. స్పందించిన ఎస్పీ చరణ్