https://oktelugu.com/

బరిలో టీడీపీ.. తెలంగాణలో డిపాజిట్లు వస్తాయా..?

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకుండా ఆంధ్ర నాయకులతో కలిసి ఎన్నో కుయుక్తులు పన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలనూ కలుపుకుపోయారు. కానీ.. చివరకు ఉద్యమం తీరును గుర్తించిన కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఓటేసింది. దీంతో చంద్రబాబు తన రెండు కళ్లలో తానే వేళ్లు పొడుచుకున్నట్లుగా అయింది. Also Read : అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 02:15 PM IST

    telangana

    Follow us on


    తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకుండా ఆంధ్ర నాయకులతో కలిసి ఎన్నో కుయుక్తులు పన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలనూ కలుపుకుపోయారు. కానీ.. చివరకు ఉద్యమం తీరును గుర్తించిన కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఓటేసింది. దీంతో చంద్రబాబు తన రెండు కళ్లలో తానే వేళ్లు పొడుచుకున్నట్లుగా అయింది.

    Also Read : అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్‌..?

    ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌ బలమైన పార్టీగా ఎదిగింది. కేసీఆర్‌‌ సీఎం సీటు ఎక్కారు. తర్వాతర్వాత బాబు సిద్ధాంతం నచ్చక ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఒకరిద్దరు లీడర్లు మినహా చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరూ లేరు ఇప్పటికి కూడా. ఏవైనా ఎన్నికల వచ్చాయంటే కనీసం అభ్యర్థులను పెడదామన్నా దొరకని పరిస్థితి ఉంది. అలాంటి టీడీపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటా చేస్తానని చెబుతోంది. కనీసం క్యాండిడేట్లకు డిపాజిట్లు అయినా దక్కుతాయా అని నెటిజన్లు అప్పుడే విమర్శలు ట్రోల్‌ చేస్తున్నారు.

    ప్రస్తుతం ఏపీలో ఎలాగూ టీడీపీ ఎటు కాని పరిస్థితుల్లోనే ఉంది. రోజురోజుకూ అక్కడ పార్టీ ఖాళీ అవుతూనే ఉంది. అందుకేనేమో ఇప్పుడు చంద్రబాబు చూపంతా తెలంగాణపై పడినట్లు కనిపిస్తోంది. ఇక్కడ పార్టీని యాక్టివ్‌ చేసే ప్రయత్నాల్లో పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను తొలగించాలని చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఎల్.రమణ మాత్రం కాస్త యాక్టివ్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ఆయన రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడం.

    రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓ స్థానంలో కోదండరాం పోటీ చేస్తుండగా.. అక్కడ కాకుండా హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పార్టీ నేతను బరిలో దింపాలని ఎల్.రమణ ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు పార్టీ నేతలతో చర్చించారట. పార్టీ తరఫున అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు ఓ లింక్ పంపి సర్వే చేస్తున్నారు. ఎక్కువ మంది పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

    ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడిన తెలుగుదేశం పార్టీపై ఇప్పటికే విద్యావంతుల్లో పీకల్లోతు కోపం ఉంది. ఈ ఎన్నికలతోనైనా యాక్టివ్ అయితే ముందు ముందు మరింత మెరుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవచ్చని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నేతలు.. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నా పోటీ విషయంలో ముందుకే వెళతారా లేకుంటే వెనక్కి తగ్గుతారా అన్నది టీ టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది.