https://oktelugu.com/

Unstoppable 4 Show : నా సోదరుడు చిరంజీవి కి ఇది ఇచ్చేస్తున్నాను అంటూ బాలయ్య బాబు ఎమోషనల్ కామెంట్స్!

ప్రస్తుతం ఆయన 'అన్ స్టాపబుల్ 4' కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 5 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సరికొత్త సీజన్ ఇటీవలే ఆరవ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఆరవ ఎపిసోడ్ కి ముఖ్య అతిథులుగా నవీన్ పోలిశెట్టి, శ్రీలీల పాల్గొన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 09:05 PM IST

    Balakrishna Unstoppable 4 Show

    Follow us on

    Unstoppable 4 Show :  సీనియర్ హీరోలలో మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కి ఉన్నటువంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిన్నటి తరం హీరోలైన వీళ్లిద్దరు, ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేయడమే కాకుండా, వాళ్ళతో సమానంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కూడా కొల్లగొడుతున్నారు. డ్యాన్స్, ఫైట్స్ లలో వీళ్ళ వయస్సుకి ఈ రేంజ్ లో చేయడం అనేది సాధారమైన విషయం కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద సరిసమైనమైన ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుకోవడం చూస్తే ఇరువురి హీరోల అభిమానులకు కనుల పండుగగా ఉంటుంది. అలాంటి సందర్భాలు ఇటీవల కాలం లో ఎన్నో జరిగాయి. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, బాలయ్య గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా IIFA అవార్డ్స్ ని అందుకున్న సమయంలో కూడా బాలయ్య చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడుతాడు.

    అంతకు ముందు వీళ్లిద్దరి మధ్య చిన్న గ్యాప్ ఏర్పడిన విషయం వాస్తవమే. తనని చిరంజీవి అనేక ఫంక్షన్స్ కి గౌరవించి పిల్లవడు, నేనున్నాను అనే విషయాన్నే గుర్తించడు అంటూ పలు సందర్భాల్లో బాలయ్య అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి పై పరోక్షంగా ఎన్నో సెటైర్లు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి వీళ్లిద్దరు స్నేహంగా ఉండడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే బాలయ్య మరోసారి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తీసుకొస్తాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఆయన ‘అన్ స్టాపబుల్ 4’ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 5 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సరికొత్త సీజన్ ఇటీవలే ఆరవ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఆరవ ఎపిసోడ్ కి ముఖ్య అతిథులుగా నవీన్ పోలిశెట్టి, శ్రీలీల పాల్గొన్నారు.

    వీళ్లిద్దరు బాలయ్య తో గడిపిన సందర్భాలు చూసేందుకు చాలా సరదాగా అనిపించాయి. అందులో భాగంగా వీళ్లిద్దరికీ బాలయ్య పలు టాస్కులు ఇస్తాడు. ఒక పాట పేరు చెప్పినప్పుడు ముందుగా ఎవరైతే పరిగెత్తుకుంటూ వచ్చి బజర్ మోగిస్తారో, వాళ్ళు ఆ పాటకు సంబంధించిన హుక్ స్టెప్ ని వెయ్యాలి. ఇదేదో బిగ్ బాస్ లో నిర్వహించే టాస్క్ లాగా అనిపిస్తుంది కదూ!..ముందుగా ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ వెయ్యగా, శ్రీలీల బజర్ నొక్కి, హుక్ స్టెప్పు వేసి ఒక పాయింట్ గెలుచుకుంటుంది. ఆ తర్వాత ఇంద్ర చిత్రం లోని ‘దాయి దాయి దామ్మా’ పాట వేయగా, ఇద్దరు బజర్ నొక్కుతారు. కానీ ఇద్దరూ కూడా సరిగా డ్యాన్స్ వెయ్యరు. దీంతో బాలకృష్ణ ఈ పాయింట్ మీ ఇద్దరికీ ఇవ్వను, నా బ్రదర్ చిరంజీవి కి ఇచ్చేస్తున్నాను అని చెప్పి చిరంజీవి కి ఆ పాయింట్ ని డేడికేట్ చేస్తాడు బాలయ్య.