Daku Maharaj Movie: ప్రస్తుతం సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అఖండ’ చిత్రం తో మొదలైన బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ జాతర, కొనసాగుతూనే ఉంది. ‘అఖండ’ తర్వాత ఆయన నటించిన ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి. ‘రూలర్’ చిత్రం తో బాలయ్య కెరీర్ ఇక ముగిసిపోయింది, అభిమానులు కూడా ఇక ఆయన సినిమాలను చూడలేరు అనే రేంజ్ నుండి, ఇప్పుడు బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది, మినిమం గ్యారంటీ అనే రేంజ్ కి వచ్చాడంటే, బాలయ్య గ్రాఫ్ ఈమధ్య కాలంలో ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బాలయ్య మాస్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ఆయన మాస్ తో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఆయన రీసెంట్ సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి సక్సెస్ అవుతున్నాయి.
‘భగవంత్ కేసరి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న బాలయ్య, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు బాబీ తో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం, జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క గ్లిమ్స్ వీడియో తోనే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తి అయ్యింది. బాలయ్య ని మరోసారి పవర్ ఫుల్ అవతార్ లో చూడబోతున్నామని, కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే వైబ్స్ ఈ గ్లిమ్స్ వీడియోని చూసినప్పుడు అనిపించింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషస్ ని ఓవర్సీస్ బయ్యర్స్ కి చూపించారట మేకర్స్. వాళ్ళ నుండి ఈ రషస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలం లో ఇలాంటి జానర్ సినిమాలు రాలేదని, బాలయ్య బాబు ఈ చిత్రం లో రిస్క్ చేసి రెండు సన్నివేశాల్లో నటించాడని, ఆ రెండు సన్నివేశాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయని అంటున్నారు. ఈ రెండు సన్నివేశాలకు సంబంధించిన గ్లిమ్స్ షాట్స్ ట్రైలర్ లో జత చేస్తారట. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత బయ్యర్స్ ఎంత డబ్బులైన పెట్టి కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నట్టు సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో సమానంగా ఈ చిత్రం కూడా వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలుస్తుందని బయ్యర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారట.