Chiranjeevi Srikanth Odela movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. దసర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) లాంటి దర్శకుడు సైతం మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మరోసారి మరో సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప విజయాలను సాధించిన నటుడు కూడా తనే కావడం విశేషం… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. తెలుగులో ఆయన దాదాపు 50 సంవత్సరాలుగా మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు.
Also Read:బాలయ్య బాబు భారీ ఆశలు పెట్టుకున్న ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయా..?
మరి ఇలాంటి క్రమంలో చిరంజీవితో చేయబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే ధోరణిలో వాళ్ళ అభిమానుల్లో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెలా చేయబోతున్న సినిమా ఒక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉండబోతుందట.
చిరంజీవి ఇందులో డాన్ క్యారెక్టర్ ని పోషించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు చిరంజీవి ఫుల్ లెంత్ డాన్ క్యారెక్టర్ అయితే చేయలేదు. కాబట్టి ఈ సినిమాతో ఆ పాత్రను చేసి మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెలకి ప్రస్తుతం ఉన్న దర్శకులందరిలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.
Also Read:ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా క్లైమాక్స్ ఫైట్ ను అక్కడ షూట్ చేయబోతున్నారా..?
మరి ఆయన క్రేజ్ ను నిలబెట్టుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెచ్చుకునేలా సినిమాను చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఈ సినిమాతో కనక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం శ్రీకాంత్ ఓదెల పేరు ఇండియాలో మారుమ్రోగిపోతోంది. అలాగే స్టార్ డైరెక్టర్ లిస్టులో తను చేరిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…