https://oktelugu.com/

Mokshagna : మోక్షజ్ఞపై బాలయ్య ప్రయోగాలు, అవసరమా అంటున్న అభిమానులు!

Mokshagna : మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఒక పక్క సందిగ్ధత నెలకొంది. మరోవైపు బాలకృష్ణ కొడుకు మీద ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అభిమానుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకీ మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటో చూద్దాం..

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2024 / 10:34 PM IST

    Mokshagna

    Follow us on

    Mokshagna : నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై సందిగ్ధత కొనసాగుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ అధికారిక ప్రకటన జరిగి చాలా కాలం అవుతుంది. మూవీలో మోక్షజ్ఞ లుక్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ ప్రశాంత్ వర్మ ఒక పోస్టర్ కూడా విడుదల చేశాడు. మోక్షజ్ఞ లుక్ కి మిశ్రమ స్పందన దక్కింది. డిసెంబర్ 5న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. పూజా కార్యక్రమం కొరకు రూ. 30 లక్షలలో ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారట. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం ఆగిపోయిందట. 
     
    ప్రశాంత్ వర్మ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాటు, లాభాల్లో వాటా అడుగుతున్నాడంటూ ఓ పుకారు తెరపైకి వచ్చింది. మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ రద్దయినట్లే అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లకు నిర్మాతలు చెక్ పెట్టారు. మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు స్పష్టత ఇచ్చారు. సందర్భానుసారంగా అప్డేట్స్ వస్తాయని తెలియజేశారు. నిర్మాతల మాటల్లో కూడా పూర్తిగా నిజం ఉందని నమ్మలేం. 
     
    ఇదిలా ఉండగా బాలకృష్ణ స్వయంగా తన డైరెక్షన్ లో మోక్షజ్ఞతో ఒక మూవీ చేయాలని అనుకుంటున్నాడట. బాలకృష్ణ ఫస్ట్ మూవీ తాతమ్మ కల కు తండ్రి ఎన్టీఆర్ దర్శకుడు. అదే తరహాలో తన కొడుకుని బాలకృష్ణ తన డైరెక్షన్ లో పరిచయం చేయాలనే ఆలోచన చేస్తున్నాడట. గతంలో బాలకృష్ణ ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. ఆదిత్య 999 మ్యాక్స్ కథను బాలయ్య రాశారట. ఇది ఆదిత్య 369కి సీక్వెల్ అనుకోవచ్చు. 
     
    ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ స్టేటస్ ఏమిటో తెలియదు కానీ.. ఆదిత్య 999 మ్యాక్స్ కి బాలకృష్ణ ఏర్పాట్లు మొదలుపెట్టాడట. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీకి సిద్ధం అవుతున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. కానీ బాలయ్య నిర్ణయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. దర్శకుడిగా బాలయ్యకు అనుభవం లేదు ఓ ఇరవై ఏళ్ల క్రితం నర్తనశాల అనే పౌరాణిక చిత్రం ఆయన దర్శకత్వంలో మొదలై మధ్యలో ఆగిపోయింది. బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ చేయడం చాలా రిస్క్ అని మెజారిటీ అభిమానుల అభిప్రాయం.