https://oktelugu.com/

Nitish Kumar Reddy: నితిష్ కుమార్ రెడ్డి సెంచరీ.. డ్రెస్సింగ్ రూమ్ లో కుమారుడిని చూసి.. భావోద్వేగం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..

Nitish Kumar Reddy: మెల్ బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండి ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అతడు చేసిన సెంచరీ ద్వారా టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది.. మూడోరోజు ఆస్ట్రేలియా జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2024 / 10:30 PM IST

    Nitish Kumar Reddy(3)

    Follow us on

    Nitish Kumar Reddy: బాక్సింగ్ డే టెస్ట్ లో  టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అజేయ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. 176 బంతులను విజయవంతంగా ఎదుర్కొని.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 105 రన్స్ సాధించాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు  127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.. అతడు చేసిన ఆ సెంచరీ వల్ల టీమ్ ఇండియా ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడింది. అంతేకాదు ఆస్ట్రేలియా కు దీటుగా బదులివ్వగల స్థాయికి చేరింది.  రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు విఫలమైన చోట నితీష్ కుమార్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. బౌలర్ ఎవరైనా సరే.. తన స్టైల్ బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను వదిలిపెట్టకుండా బాదాడు. పదునైన బంతులను డిఫెన్స్ ఆడాడు. మొత్తంగా ఆస్ట్రేలియా బౌలర్లకు ఓ వీవీ ఎస్ లక్ష్మణ్ , రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, అజహారుద్దీన్ వంటి ఆటగాళ్ల ఆట తీరును పరిచయం చేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్రయోగించని బౌలర్ అంటూ లేడు అంటే అతిశయోక్తి కాక మానదు.
    గుండెలకు హత్తుకున్నారు..
    సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెల్ బోర్న్ మైదానంలో ప్రేక్షకులతో పాటు మ్యాచ్ చూస్తున్న నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యాడు. ముఖ్యంగా 99 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు.. సహచర ఆటగాడు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బుమ్రా కూడా అతని దారిని అనుసరించాడు. ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ బ్యాటింగ్ కు వచ్చాడు. కమిన్స్ వేసిన మూడు బంతులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దీంతో తదుపరి ఓవర్లో స్ట్రైకింగ్ చేసే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి వచ్చింది. దీంతో అతడు సూపర్ షాట్ కొట్టి బౌండరీకి తరలించాడు. తద్వారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు  . ఈ సెంచరీ ద్వారా టెస్టులలో తొలి శతకాన్ని సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించిన అనంతరం.. అతడి తండ్రి ఆనందంలో మునిగిపోయాడు. కన్నీరు కార్చాడు. రాత్రి సమయంలో నితీష్ కుమార్ రెడ్డి డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లి అతడిని గట్టిగా హత్తుకున్నాడు. ముత్యాల రెడ్డి వెంట ఆయన భార్య, కుమార్తె కూడా ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డిని ముత్యాల్ రెడ్డి గట్టిగా హత్తుకుని.. శుభాకాంక్షలు తెలియజేశాడు. అతడి తల్లి కూడా అదేవిధంగా హత్తుకొని.. కన్నీటి పర్యంతమయ్యారు. సోదరి కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. భావోద్వేగమైన సన్నివేశం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.