Chanakya Niti: ఆచార్య చాణుక్యుడి నీతి శాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. ఆ నీతి శాస్త్రంలో చాణిక్యుడు ఆరోగ్యం, డబ్బు, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయం వంటి అనేక అంశాల మీద తన అభిప్రాయాలను అందించాడు. చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుడిగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా ఆచార చాణిక్యుడికి మంచి గుర్తింపు ఉంది. అతనిని కౌటిల్యుడు అని కూడా అంటారు. అతను అందించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. అతని నీతి శాస్త్రంలోని సూత్రాలను జీవితంలో అమర్చుకుంటే విజయం తప్పనిసరిగా వరిస్తుందని చాలామంది నమ్ముతారు. ఆచార చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో స్త్రీల స్వభావం గురించి కూడా చెప్పడం జరిగింది. సాధారణంగా స్త్రీల స్వభావం ఏంటో అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని అని చెబుతుంటారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని అంటే స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అని చాలామంది అభిప్రాయం. స్త్రీలు ఏ సమయంలో సంతోషంగా ఉంటారో అలాగే ఏ సమయంలో విచారంగా ఉంటారో తెలుసుకోవడం కష్టమైన పని అని చానుక్యుడు కూడా తన నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. చాణుక్యుడు స్త్రీల స్వభావాన్ని ఆమె శరీరంలోని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. వారి శరీరంలోని సంకేతాలను తెలుసుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వం ఏంటో వారు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు అని చాణుక్యుడు కొన్ని సంకేతాలు చెప్పారు.
పొట్టి మెడ : చిన్న మెడ ఉన్న స్త్రీలు తనంతట తానుగా అనిశ్చితంగా ఉంటారట. అలాంటి మహిళలు తమ జీవితంలో అన్నీ నిర్ణయాలకు ఇతరులపై ఆధారపడి ఉంటారని అలాగే వారు ఎటువంటి సొంత నిర్ణయం తీసుకోలేరని చాణుక్యుడు తెలిపాడు.
పొడవాటి మెడ: నాలుగు వేళ్ళ కంటే పెద్ద మెడ అంటే పొడవాటి మెడ ఉన్న స్త్రీలు కుటుంబాన్ని నాశనం చేస్తారని చాణుక్యుడు తెలిపాడు. అలాంటి స్త్రీలకు దూరంగా ఉండడం మంచిదని చాణుక్యుడు సూచించాడు.
బోలు బుగ్గలు కలిగిన స్త్రీ : ఇలాంటి వాళ్లు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి స్త్రీలు తమకు తెలియకుండానే ఇతరులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతారు. భవిష్యత్తులో వీళ్ళు వేరే స్థాయిలో జీవితం గడిపే అవకాశం ఉందని చాణుక్యుడు తెలిపాడు.
పెద్ద పళ్ళు : పొడవాటి, మందపాటి, వెడల్పాటి దంతాలు ఉన్న స్త్రీలు తమ జీవితంలో ఎప్పుడు విషాదాన్ని చవిచూస్తారని చాణుక్యుడు తెలిపాడు. ఇటువంటి స్త్రీలు వాళ్లు కోరుకున్నప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని గడపదు.
చెవి వెంట్రుకలు ఉన్న స్త్రీలు : ఇటువంటి స్త్రీలను అహంకారంగా, దూకుడుగా భావిస్తారు. వీళ్ల వల్ల ఇంట్లో వాదనలు, వివాదాలు తలెత్తుతాయి. ఇటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఇప్పుడు సమస్యలతో నిండి ఉంటుందని చాణిక్యుడు తెలిపాడు.
సోమరితనం : ఇటువంటి స్త్రీలు జీవితంలో విజయం సాధించడానికి అనేక ఇబ్బందులు పడతారు. ఎంత ప్రయత్నించినా తమ లక్ష్యాలను సాధించలేరు. ఇటువంటి స్త్రీలు తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రేమను పొందినప్పటికీ సమాజంలోని ఇతరులు వీరిని ఇష్టపడరని చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పుకొచ్చాడు.