https://oktelugu.com/

Mahesh Babu Kalavathi Song: ‘కళావతి’తో యూట్యూబ్‌ ను షేక్ చేస్తోన్న మహేష్ !

Mahesh Babu Kalavathi Song: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట యూట్యూబ్‌ లో 50 మిలియన్స్‌ కు పైగా వ్యూస్‌ ను క్రాస్ చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అలాగే 1.3 మిలియన్స్‌కు పైగా లైక్స్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 12:26 PM IST
    Follow us on

    Mahesh Babu Kalavathi Song: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట యూట్యూబ్‌ లో 50 మిలియన్స్‌ కు పైగా వ్యూస్‌ ను క్రాస్ చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అలాగే 1.3 మిలియన్స్‌కు పైగా లైక్స్ సాధించింది.

    Mahesh Babu Kalavathi Song

    ఈ ఘనతపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ పరుశురామ్, సింగర్ సిద్ శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది కళావతి. ఈ పాటకు సోషల్ మీడియా లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ పాట సోషల్ మీడియాలో లీకైంది.

    Also Read: ప్రభాస్ సినిమాకి వినూత్న విచిత్ర ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా ?

    సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కూడా అయ్యింది. దాంతో ఇక ఈ పాట హిట్ కాదు అనుకున్నారు. ఆ కోపంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటకు పైరసీ బెడద గట్టిగానే తగిలినా.. ఈ పాట మాత్రం ఓ ఊపు ఊపేస్తోంది. పైగా ఇప్పటికే ఈ పాట మరో రికార్డును కూడా తన పేరిట లిఖియించుకుంది.

    యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 70 లక్షలకు పైగా వ్యూస్, 500Kకు పైగా లైకులను సంపాదించిన పాటగా కూడా కొత్త రికార్డును సెట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

    Tags