https://oktelugu.com/

‘దిల్ రాజు’కి షాక్ ఇచ్చిన బాలయ్య !

సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్యది రెండో స్థానం అయినా.. బాలయ్య మార్కెట్ పరంగా చాల వెనుక పడిపోయాడు. అందుకే బాలయ్య వైపు ఇన్నాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు నిర్మాత దిల్ రాజు. నిర్మాణం అనేది లెక్కల మీద నడుస్తోంది. తేడా కొడితే అసలుకే మోసం వస్తోంది. అందుకే, రిస్క్ అనుకుంటే రాజు వాళ్ళతో సినిమా చేయడు. బాలయ్యతో కూడా అందుకే చేయలేదు. కానీ, బాలయ్య ‘అఖండ’ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. నిర్మాతల లెక్కలు మారిపోయినట్టు కనిపిస్తోంది. […]

Written By:
  • admin
  • , Updated On : July 5, 2021 / 07:41 PM IST
    Follow us on

    సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్యది రెండో స్థానం అయినా.. బాలయ్య మార్కెట్ పరంగా చాల వెనుక పడిపోయాడు. అందుకే బాలయ్య వైపు ఇన్నాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు నిర్మాత దిల్ రాజు. నిర్మాణం అనేది లెక్కల మీద నడుస్తోంది. తేడా కొడితే అసలుకే మోసం వస్తోంది. అందుకే, రిస్క్ అనుకుంటే రాజు వాళ్ళతో సినిమా చేయడు. బాలయ్యతో కూడా అందుకే చేయలేదు.

    కానీ, బాలయ్య ‘అఖండ’ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. నిర్మాతల లెక్కలు మారిపోయినట్టు కనిపిస్తోంది. బాలయ్య వరుస ప్లాప్ ల దెబ్బకు ఆయన సినిమా గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ కావు అని ఓ అంచనా ఉంది. అందుకు తగ్గట్టుగానే బాలయ్య గత సినిమాలు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అందుకే బాలయ్య సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించేవారు కాదు.

    కానీ, బాలయ్య అఖండకి 80 కోట్లు మార్కెట్ అయ్యేలా కనిపిస్తోంది. దిల్ రాజు అందుకే బాలయ్యతో సినిమా చేయడానికి ప్రస్తుతం బాగా ప్రయత్నం చేస్తున్నాడు. తన క్యాంప్ లోనే ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. గతంలోనే అనిల్ రావిపూడి, బాలయ్యకు ఒక కథ చెప్పి ఒప్పించాడు. ఎలాగూ ‘ఎఫ్ 3’ తరువాత బాలయ్యతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు అనిల్.

    కాబట్టి అనిల్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా రానున్న సినిమాని తానే నిర్మించే విధంగా దిల్ రాజు రెడీ అవుతున్నాడు. ఈ విషయం పై తాజాగా బాలయ్యతో మాట్లాడటానికి కూడా వెళ్ళాడట. అయితే దిల్ రాజుకు బాలయ్య షాక్ ఇచ్చాడు. తానూ ప్లాప్స్ లో ఉన్నప్పుడు తనతో సినిమా చేసిన సి.కళ్యాణ్ కే తానూ సినిమా చేస్తాను తప్ప, మీతో ఇప్పుడు చేయలేను అంటూ తేల్చిపడేశాడు. ఆ మాటతో దిల్ రాజు సైలెంట్ అక్కడి నుండి వచ్చేశాడు.