
తెలంగాణ ప్రభుత్వం బీరు ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సీసాపై రూ. 10 తగ్గిస్తూ అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో సీసాపై రూ. 30 పన్ను విధించేది. దీని నుంచి రూ. 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.