Balayya: ఏపీ టికెట్​ ధరల విషయంలో తగ్గేదేలే అంటున్న బాలయ్య..

Balayya: ఏపీలో సినిమా టికెట్​ ధరలపై వివాదం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. టికెట్​ రేట్లపై ప్రభుత్వం సుప్రీమ్​కు వెళ్తే.. నిర్మాతలు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అఖండ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడలో పర్యటించిన సినిమా టీమ్​.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాము అన్నింటికీ సిద్ధమయ్యే.. అఖండ సినిమా విడుదల చేశామని.. […]

Written By: Sekhar Katiki, Updated On : December 15, 2021 3:02 pm
Follow us on

Balayya: ఏపీలో సినిమా టికెట్​ ధరలపై వివాదం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. టికెట్​ రేట్లపై ప్రభుత్వం సుప్రీమ్​కు వెళ్తే.. నిర్మాతలు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అఖండ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడలో పర్యటించిన సినిమా టీమ్​.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Balayya

ఈ విషయంలో తాము అన్నింటికీ సిద్ధమయ్యే.. అఖండ సినిమా విడుదల చేశామని.. టికెట్​ ధరలపై హైకోర్టు తీర్పు వచ్చినా రాకపోయినా.. అఖండ సినిమా ప్రేక్షకులకు చూపించాలని ఉద్దేశంతోనే ధైర్యం చేసి విడుదల చేసినట్లు తెలిపారు. ఎవ్వరు ఎన్ని చేసినా.. న్యాయ నిర్ణేత దేవుడని.. అతనే చూసుకుంటాడని అన్నారు బాలయ్య. తనకు చేతనైనంతవరకు చిత్ర పరిశ్రమను కాపాడేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.

Also Read: బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో తర్వాత గెస్టులుగా జక్కన్న, పెద్దన్నలు

అంతకుముందు విజయవాడ విమానాశ్రయంలో బాలయ్య, అఖండ టీమ్​కు బొర్రా గాంధీ, కరుణాకర్ బృందం స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడలోకి ఎంటరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు బాలయ్యతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.  ఇక డిసెంబరు 2న విడుదలైన బాలయ్య అఖండ సినిమా ఇప్పటికీ సంచలనంగా మారి కలెక్షన్ల సుమానీ సృష్టిస్తోంది. విడుదలై 15 రోజులైనా హౌస్​ ఫుల్​తో ముందుకు దూసుకెళ్లిపోతోంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా కనిపించనుండగా.. శ్రీకాంత్​, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: మంచి కథతో వస్తే మల్టీస్టారర్​కు రెడీ అంటున్న బాలయ్య