https://oktelugu.com/

Krithi Shetty: నాకు, మా కుటుంబ సభ్యులకు నాని అంటే చాలా ఇష్టం: కృతి శెట్టి

Krithi Shetty: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 24 తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రాయల్ ఈవెంట్ ను వరంగల్‌లోని రంగలీల మైదానంలో నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 11:00 AM IST
    Follow us on

    Krithi Shetty: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 24 తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రాయల్ ఈవెంట్ ను వరంగల్‌లోని రంగలీల మైదానంలో నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ లో కృతి శెట్టి, నాని మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో కృతి చెలరేగింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యోయుబే లో మంఛీ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో నిలిచింది.

    actress krithi shetty interesting words about nani

    Also Read: ఆ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా- సాయిపల్లవి

    కాగా ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ… ఈ చిత్రంలో నటీనటుల పనితీరు, ఎగ్జిక్యూషన్ చూడటానికి ట్రీట్ అవుతుంది అన్నారు. దయచేసి మాస్క్ ధరించి సురక్షితంగా వచ్చి థియేటర్లలో మాత్రమే సినిమా చూడండి అని కృతి కోరారు. సినిమాలో కీర్తిగా నటిస్తున్నాను నాకు, మా కుటుంబానికి నాని అంటే చాలా ఇష్టం. నా రెండో సినిమాలోనే ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం అని నటి పేర్కొంది. నిర్మాత వెంకట్ చాలా స్వీట్, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తన రెండో సినిమా చేస్తున్నాడు కానీ నాకు అలా అనిపించలేదు. ఆయన ఏం చేస్తున్నాడో, ఏమి కోరుకుంటున్నాడో చాలా స్పష్టంగా, నమ్మకంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ “శ్యామ్ సింగ రాయ్” దే” అంటూ కృతి శెట్టి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది.

    Also Read: ఆ హీరోయిన్ కి డేటింగ్ లు, కేసులు కొత్తేమి కాదట !