Balayya: ‘షో’లందు ‘అన్ స్టాపబుల్’ షో వేరయా… విశ్వదాభిరామ అక్కడున్నది బాలయ్య రా మావా అన్నట్టు ఉంది బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో. గెస్ట్ ఎవరు అయినా, బాలయ్య తాలూకు శైలి మాత్రం మారడం లేదు. శైలి మారినా మారకపోయినా ‘అనిపించింది అందాం…అనుకున్నది చేద్దాం …ఎవడాపుతాడో చూద్దాం’ అంటూ బాలయ్య ముందుకు వెళ్లడం,

ఇక బాలయ్య అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా .జై బాలయ్య అనడం ఒక అలవాటుగా అయిపోయింది. తాజాగా బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రోమో అదిరింది. రాజమౌళితో కీరవాణి కూడా వచ్చారు. కానీ, ప్రోమోలో చూపించలేదు. ఎలాగూ అఖండతో భారీ హిట్ కొట్టడంతో బాలయ్య కూడా ఏకంగా రాజమౌళితో సినిమా గురించి ప్రస్తావించాడు.
మరి జక్కన్న ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. సరే.. ఇక ఎప్పటిలాగే ప్రోమో ఎలా ఉన్నా జై బాలయ్య అంటూ ఆ ప్రోమో వీడియో కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. కల్మషం లేని, కల్మషం అంటని వారు మా బాలయ్య, కోపం వస్తే కొడతారు ఏమో కానీ ఎవరి జీవితాలు, కడుపులు మీద కొట్టారు, జై బాలయ్య’ అంటూ మొత్తానికి ఫ్యాన్స్ కాస్త ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతున్నారు.
అలాగే ‘మా ఇంట్లో పెరుగు లేదు బాలయ్య బాబు తిరుగులేదు జై బాలయ్య’ అంటూ కిందిస్థాయి అభిమానులు కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా మెసేజ్ లు పెడుతున్నారు. బాలయ్య ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటాడు. పైగా షోలో బాలయ్య ప్రెజెంటేషన్ కూడా చాలా ఫ్రెష్ గా రాయల్ గా ఉంది. అందుకే, బాలయ్య షో సూపర్ హిట్ అయింది.
Also Read: Anchors turned Actress: యాంకర్లుగా చేసి హీరోయిన్లుగా మారిన వారు ఎందరో తెలుసా..?
అలాగే సోషల్ మీడియాలో కూడా బాలయ్య షో తాలూకు ప్రోమోలను వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన షో ప్రోమో కూడా నేషనల్ లెవల్ లో వైరల్ అవుతుంది. అసలు సోషల్ మీడియాలో బాలయ్య ఇన్నాళ్లు వీక్ అనుకున్నారు. కానీ, చూస్తుంటే.. సోషల్ మీడియా ఎకౌంట్స్ (ఒక పేస్ బుక్ తప్ప) లేకపోయినా సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు బాలయ్య.
Also Read: OTT revolution: ఓటీటీ విప్లవానికి నాంది.. సినిమా వాళ్లకు ఉపాధి !