Balayya : నందమూరి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న అంశం మోక్షజ్ఞ అరంగేట్రం. మూడు పదుల వయసొచ్చినా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ పదేళ్లు ఆలస్యం అయినట్లే లెక్క. ఒక దశలో మోక్షజ్ఞకు ఆసక్తి లేదనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ మాత్రం పట్టు వదలకుండా అతని మనసు మార్చాడట. హీరో కావాలని డిసైడ్ అయ్యాక, మోక్షజ్ఞ సినిమా సెట్స్ కి వెళ్లడం ఆరంభించాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి షూటింగ్స్ కి మోక్షజ్ఞ హాజరయ్యేవాడు.
ఎట్టకేలకు ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దు అయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో పట్టాలెక్కాల్సిన మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం లేదు. ప్రశాంత్ వర్మతో తలెత్తిన విబేధాలే ఇందుకు కారణం అనే వాదన ఉంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ వదులుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రభాస్ తో మూవీ సెట్ చేశాడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ ఆగిపోయిన క్రమంలో బాలకృష్ణ మరో మార్గం వెతికాడట. మోక్షజ్ఞతో మల్టీస్టారర్ చేయాలి అనుకుంటున్నాడట. అందుకు దర్శకుడు, నిర్మాత కూడా సెట్ అయ్యారట. బాహుబలి వంటి బడా ప్రాజెక్ట్ నిర్మించిన ఆర్కా మీడియా బాలయ్య-మోక్షజ్ఞల మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయనుందట. ఇక క్రిష్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఇది బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ అని సమాచారం. ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 కథను బాలకృష్ణ స్వయంగా రాసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి తానే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నాడు. ఈ కథనే దర్శకుడు క్రిష్ చేతిలో పెట్టాడట బాలకృష్ణ. ఆదిత్య 999లో బాలకృష్ణ-మోక్షజ్ఞ నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణ.. జూన్ లేక జులైలో గోపీచంద్ మలినేని మూవీ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆదిత్య 999 పట్టాలెక్కనుందని అనేది తాజా వార్త.