https://oktelugu.com/

Balayya: ‘అన్​స్టాపబుల్’​ జోరుతో మరో సరికొత్త షోకు బాలయ్య శ్రీకారం

Balayya: నందమూరి బలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. డిసెంబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్​ శిల్పకళా వేదికపై ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు మేకర్స్​. కాగా, ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్​ ప్లాట్​ఫామ్​ వేదికగా టాక్​ షో నిర్వహిస్తూ.. సరికొత్త ట్రెండ్​ సృష్టించారు బాలయ్య. అన్​స్టాపబుల్​ షోతో దూసుకెళ్లిపోతున్న బాలయ్య.. ఇప్పటికే రెండు ఎపిసోడ్లను కంప్లీట్​ చేసి.. టాక్​ ఆఫ్​ది షోగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 28, 2021 / 10:02 AM IST
    Follow us on

    Balayya: నందమూరి బలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. డిసెంబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్​ శిల్పకళా వేదికపై ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు మేకర్స్​. కాగా, ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్​ ప్లాట్​ఫామ్​ వేదికగా టాక్​ షో నిర్వహిస్తూ.. సరికొత్త ట్రెండ్​ సృష్టించారు బాలయ్య. అన్​స్టాపబుల్​ షోతో దూసుకెళ్లిపోతున్న బాలయ్య.. ఇప్పటికే రెండు ఎపిసోడ్లను కంప్లీట్​ చేసి.. టాక్​ ఆఫ్​ది షోగా నిలిచారు. తాజాగా,థర్డ్​ ఎపిసోడ్​ కూడా షురూ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో తర్వాత గెస్ట్ ఎవరన్న విషయంపై చర్చ జరుగుతోంది.

    అయితే, ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో బాలయ్య మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.  ఇప్పటికే అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య.. అదే ఓటీటీలో భక్తి సంబంధిత కార్యక్రమాన్ని ప్లాన్​ చేస్తున్నట్లు బయట పెట్టారు. త్వరలోనే వివారాలు వెల్లడించనున్నట్లు  వివరించారు. అఖండ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ సమక్షంలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు బాలయ్య. పౌరాణిక పద్యాల్ని, మంత్రాన్ని ఉచ్ఛారణతో సహా చెప్పే బాలయ్య.. అదే టాలెండ్​ను ఈ భక్తి ప్రసార కార్యక్రమం ద్వారా డిజిటల్​ ఆడియన్స్​ను పలకరించనున్నట్లు అర్థమవుతోంది.

    కాాగా, బోయపాటి తెరకెక్కించిన అఖండ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించింది. విలన్​గా శ్రీకాంత్​ అలరించగా.. జగపతి బాబు విభిన్న పాత్రలో కనిపించనున్నారు. కాగా, యంగ్​ మ్యూజిక్ డైరెక్టర్​ థమన్​ ఈ సినిమాకు స్వరాలు అందించారు.