https://oktelugu.com/

Pragya Jaiswal : బికినీ వేసిన బాలయ్య హీరోయిన్ ప్రగ్య జైస్వాల్… హీటు పుట్టించే బోల్డ్ లుక్ వైరల్

తాజాగా పర్పుల్ కలర్ బికినీ ధరించి రచ్చ రచ్చ చేసింది. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రగ్య హాట్ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2024 / 06:33 PM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal : ప్రగ్య జైస్వాల్ అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. ఏకంగా బికినీలో అందాలు విందు చేస్తుంది. ఆమె లేటెస్ట్ హాట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ప్రగ్య జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. అందుకే స్టార్ కావాల్సిన భామ రేసులో వెనుకబడిపోయింది. ప్రగ్య పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటింది. అయినా కనీసం ఒక స్థాయి హీరోయిన్ కాలేకపోయింది. మిర్చిలాంటి కుర్రోడు సినిమాతో ప్రగ్య తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమెకు కంచె మూవీతో ఫేమ్ వచ్చింది .

    పీరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె మూవీ ఓ మోస్తరు విజయం సాధించింది. కంచె మూవీలో వరుణ్ తేజ్ హీరో కాగా, క్రిష్ దర్శకుడు. తర్వాత మరలా ఆమెను హిట్ పలకరించలేదు. గుంటూరోడు, నక్షత్రం వంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన జయజానకీ నాయక పర్లేదు అనిపించుకుంది. కానీ ఆ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్.

    ప్రగ్య సోలోగా అఖండ తో భారీ హిట్ కొట్టింది. అఖండ విడుదలకు ముందు వరకు బాలయ్యకు కూడా హిట్ లేదు. అందుకే ప్రగ్య జైస్వాల్ కి ఛాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. అఖండ హిట్ తో ప్రగ్య ఫేట్ మారుతుంది అనుకుంటే అలా జరగలేదు. ఆమెకు కనీసం టైర్ టు హీరోలు కూడా ఆఫర్స్ ఇవ్వడం లేదు. ప్రగ్య నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ ఇండియా.

    సిల్వర్ స్క్రీన్ పై కనిపించి అమ్మడు చాలా కాలం అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో గిలిగింతలు పెడుతుంది. తాజాగా పర్పుల్ కలర్ బికినీ ధరించి రచ్చ రచ్చ చేసింది. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రగ్య హాట్ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.