https://oktelugu.com/

మళ్ళీ అక్కడే షూటింగ్.. బాలయ్య సెంటిమెంట్ వల్లే !

నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమా షూటింగ్ సోమవారం నుండి యాదగిరిగుట్టలో మొదలుకానుందని తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. గతంలో ఆల్ రెడీ ఇక్కడ కొంతభాగం షూట్ చేశారు. అప్పుడు మిగిలిపోయిన బ్యాలెన్స్ వర్క్ ను సోమవారం నుండి చేస్తారట. అయితే ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో షూట్ చేద్దామనుకున్నా.. అప్పుడున్న పరిస్థితుల రీత్యా యాదగిరిగుట్టలో సెట్ వేసి షూట్ చేశారు. Also […]

Written By:
  • admin
  • , Updated On : February 12, 2021 / 05:18 PM IST
    Follow us on


    నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమా షూటింగ్ సోమవారం నుండి యాదగిరిగుట్టలో మొదలుకానుందని తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. గతంలో ఆల్ రెడీ ఇక్కడ కొంతభాగం షూట్ చేశారు. అప్పుడు మిగిలిపోయిన బ్యాలెన్స్ వర్క్ ను సోమవారం నుండి చేస్తారట. అయితే ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో షూట్ చేద్దామనుకున్నా.. అప్పుడున్న పరిస్థితుల రీత్యా యాదగిరిగుట్టలో సెట్ వేసి షూట్ చేశారు.

    Also Read: ‘బంగార్రాజు’ పరిస్థితి పై ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ !

    అన్నట్లు బాలయ్య సినిమాలు గతంలో ఇక్కడ చాలావరకు షూటింగ్ జరుపుకున్నాయి. సింహ సినిమా కూడా యాదగిరిగుట్టలో షూటింగ్ జరుపుకుంది. మళ్ళీ ఇప్పుడు బోయపాటి నరసింహా స్వామివారి ఆలయంలో షూట్ చేస్తున్నాడట. మొత్తానికి బాలయ్య సెంటిమెంట్ వల్లే ఇక్కడ షూట్ చేస్తున్నారని కూడా కామెంట్స్ ఉన్నాయి. ఇక ఈ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనదని.. అందుకే భారీ సెట్ వేసి షూట్ చేయడానికి బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం.

    Also Read: సుధాక‌ర్ ఇక్క‌డ‌ క‌మెడియ‌న్‌.. అక్క‌డ స్టార్ హీరో.. మీకు తెలుసా..?

    ఇక సీన్ విషయానికి వస్తే.. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బాలయ్య పాత్ర హోమం చేయిస్తూ ఉండగా విలన్స్ అటాక్ చేస్తారని.. విలన్స్ ను చంపే ప్రయత్నంలో సీనియర్ బాలయ్య పాత్ర కూడా ఇక్కడే చనిపోతుందని తెలుస్తోంది. పర్సనల్ గా బాలయ్యకి ఈ సీక్వెన్స్ బాగా నచ్చిందట. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్