https://oktelugu.com/

సక్సెస్ కోసం స్టార్ డైరెక్టర్ కష్టాలు !

సినిమా ఇండస్ట్రీలో విలువులు లేవు అని ఒక మాట బాగా ప్రచారంలో ఉంది. ఆ మాటలో వాస్తవం పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీ కేవలం సక్సెస్ వెంటే పడుతుంది, సక్సెస్ ఉంటేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయి, లేకపోతే, మహామహులకే కేరాఫ్ అడ్రెస్ లేకుండా పోతుంది. స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ పరిస్థితి ప్రస్తుతం అలాగే తయారైంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరూ వినాయక్ వెంట పడుతూ సినిమా చేసి పెట్టమని బతిమిలాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ […]

Written By:
  • admin
  • , Updated On : February 12, 2021 / 05:26 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో విలువులు లేవు అని ఒక మాట బాగా ప్రచారంలో ఉంది. ఆ మాటలో వాస్తవం పక్కన పెడితే.. సినిమా ఇండస్ట్రీ కేవలం సక్సెస్ వెంటే పడుతుంది, సక్సెస్ ఉంటేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయి, లేకపోతే, మహామహులకే కేరాఫ్ అడ్రెస్ లేకుండా పోతుంది. స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ పరిస్థితి ప్రస్తుతం అలాగే తయారైంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరూ వినాయక్ వెంట పడుతూ సినిమా చేసి పెట్టమని బతిమిలాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య వినాయక్ కు అసలు టైం బాగాలేదు.

    Also Read: సుధాక‌ర్ ఇక్క‌డ‌ క‌మెడియ‌న్‌.. అక్క‌డ స్టార్ హీరో.. మీకు తెలుసా..?

    మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. నిజానికి మిస్ అయింది అనడం కంటే, వినాయక్ ను పక్కన పెట్టారు అనడం కరెక్ట్. కేవలం వినాయక్ కి ఇప్పుడు సక్సెస్ లేదు గనుక అతనికి అవకాశం ఇవ్వడం లేదు. చివరికి వినాయక్ కి మాత్రం సినిమా లేకుండా పోయింది. అయితే వినాయక్ మాత్రం మంచి ప్రాజెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రస్తుతం బాగా కసరత్తులు చేస్తున్నాడు. వినాయక్ తన తరువాత సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత ఆకుల శివతో స్టోరీ మీద కూర్చున్నాడు.

    ఇప్పటికే వినాయక్ తన కొత్త కథను హీరో రామ్ కు వినిపించారని.. రామ్ కు కూడా వినాయక్ చెప్పిన కథ బాగా నచ్చిందని.. ఈ సినిమాని మార్చి నుండి స్టార్ట్ చేయనున్నారని సమాచారం. కాకపోతే, వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ బాలీవుడ్ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా ఇప్పట్లో ఉండదు అని అందరి నమ్మకం. అందుకే సైలెంట్ గా వినాయక్ మరో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని వినాయక్ నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన నమ్మకానికి తగ్గట్లే… మళ్లీ హిట్ కొడతాడా ? లేదా ? అనేది చూడాలి.

    Also Read: ‘బంగార్రాజు’ పరిస్థితి పై ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ !

    నిజానికి గత ఏడాది వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ.. అది మధ్యలోనే ఆగిపోయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్