బాలయ్య బాబు సినిమాలు అంటే..ఇప్పుడు క్రేజ్ కాస్త తగ్గింది గాని, ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య సినిమాల టైటిల్స్ ను పచ్చబొట్లుగా వేయించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే బాలయ్య సినిమాలకు మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్స్ నే పెట్టాలని ఆశ పడుతూ ఉంటారు, బాలయ్యతో సినిమాలు చేసే దర్శకులు. కాగా ప్రస్తుతం బాలయ్య ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది, అందుకే వీరి సినిమాకి ఒక పవర్ ఫుల్ టైటిల్ కోసం వెతుకుతున్నారు.
ఈ క్రమంలో టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. వాటిల్లో మొదట్లో ‘మోనార్క్’ అనే టైటిల్ బాగా వినిపించింది. కానీ ఎందుకో బోయపాటి ఆ టైటిల్ పై ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ తరువాత మరో ఇంట్రస్టింగ్ టైటిల్ వినిపిచింది, అదే ‘టార్చ్ బెర్రర్’. ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’ అనే మరో పవర్ ఫుల్ టైటిల్ ను పెడుతున్నారు అన్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు బాలయ్య సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ నే పెట్టబోతున్నారట. ఇక బోయపాటి – బాలయ్య కలయికలో సినిమా అంటేనే.. అదొక బీభత్సమైన యాక్షన్ డ్రామాగా ఉంటుంది.
అది దృష్టిలో పెట్టుకునే… ముఖ్యంగా తమ కాంబినేషన్ కు ఉన్న మార్క్ చెడిపోకుండా.. పైగా ఒక కొత్త మార్క్ ను అందుకోవటానికి ప్రయత్నిస్తూ.. బోయపాటి ఈ సినిమాని మలిచాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్స్ అండ్ ఫుల్ యాక్షన్ తో సాగే ఫైట్ సీన్స్ తో అభిమానులను ఫుల్ గా అలరించడం ఖాయం అని.. అలాగే ఈ సారి అద్భుతమైన ఎమోషన్ తో వెరీ ఎమోషనల్ గానూ బాలయ్య సినిమా చాలా వైవిధ్యంగానూ ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర చనిపోతుందని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.