‘ఆర్ఆర్ఆర్’లో గొప్ప ప్రేమ కథ:ఎలా ఉంటుందో?

యోధుడు ‘కొమరం భీం’ పాత్రలో ‘ఎన్టీఆర్’ నటిస్తున్నాడని ఎప్పుడైతే రాజమౌళి ఎనౌన్స్ చేశాడో.. అప్పటినుండి ఆ పోరాటల బిడ్డ, నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా రక్తం చిందించిన ఆ వీరుడు అంటూ ‘కొమరం భీం’ గురించి మళ్ళీ ముమ్మరంగా చర్చ మొదలైంది. అయితే, కొమరం భీం అనగానే ఆయన స్వచ్ఛమైన అడవితల్లి బిడ్డ అని, అదేవిధంగా అడవిజాతి బాగు కోసం బతుకును ధారపోసి ప్రాణాలనే వదులుకున్న త్యాగమూర్తీ అంటూ ఆయన గురించి ఇలా చాల విన్నాం. అలాగే […]

Written By: admin, Updated On : April 9, 2021 6:10 pm
Follow us on


యోధుడు ‘కొమరం భీం’ పాత్రలో ‘ఎన్టీఆర్’ నటిస్తున్నాడని ఎప్పుడైతే రాజమౌళి ఎనౌన్స్ చేశాడో.. అప్పటినుండి ఆ పోరాటల బిడ్డ, నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా రక్తం చిందించిన ఆ వీరుడు అంటూ ‘కొమరం భీం’ గురించి మళ్ళీ ముమ్మరంగా చర్చ మొదలైంది. అయితే, కొమరం భీం అనగానే ఆయన స్వచ్ఛమైన అడవితల్లి బిడ్డ అని, అదేవిధంగా అడవిజాతి బాగు కోసం బతుకును ధారపోసి ప్రాణాలనే వదులుకున్న త్యాగమూర్తీ అంటూ ఆయన గురించి ఇలా చాల విన్నాం. అలాగే ఆయన జీవితంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారని కూడా విన్నాం.

ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీల చుట్టే రాజమౌళి గొప్ప ప్రేమ కథను అల్లాడని.. సినిమాలో గొప్ప ప్రేమ కథ ఎన్టీఆర్ ట్రాక్ లో ఉండబోతుందని తెలుస్తోంది. చరిత్ర చేత మర్చిపోబడ్డ ఆ గొప్ప ప్రేమ కథ.. భవిష్యత్తు తరాలకు అందేలా జక్కన్న ఈ చిత్రంలో అట్టహాసంగా హంగూఆర్భాటాల మధ్య ఆ ప్రేమ కథను ఆసక్తిగా మలిచాడట. అయినా, ఈ ప్రేమ కథలో రొమాన్స్ కంటే కూడా.. త్యాగం ఎక్కువ కనిపిస్తోందని.. అందుకే ఇద్దరు హీరోయిన్స్ లో ఒకర్ని హాలీవుడ్ భామను రాజమౌళి తీసుకున్నాడని టాక్.

మరి ఆ ప్రేమ కథ ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యేవరకూ ఎదురుచూడాల్సిందే. ఇక బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుంది కాబట్టి, ఈ క్రేజీ చిత్రం పై మొదటినుండి భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్, చరణ్ తో పాటు అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ క్రేజీ మల్టి స్టారర్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయిపోయింది. అన్నట్టు ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు.