https://oktelugu.com/

రకుల్ తరువాత ప్రణీతను పట్టుకున్నాడు !

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను ఒక మినీ ఇండస్ట్రీ అంటుంటారు. అదే బాలీవుడ్ లో అయితే అజయ్ దేవగణ్ ను ఇండియన్ మూవీ మిషన్ అని కూడా అంటారు. ఎందుకంటే, ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేసే స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ తరువాత అజయ్ దేవగన్ మాత్రమే. ప్రస్తుతం యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మిస్తున్న ఓ చిత్రంలో అజయ్ దేవగణ్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. Also Read: […]

Written By: , Updated On : February 9, 2021 / 04:03 PM IST
Follow us on

Pranitha Subhash
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను ఒక మినీ ఇండస్ట్రీ అంటుంటారు. అదే బాలీవుడ్ లో అయితే అజయ్ దేవగణ్ ను ఇండియన్ మూవీ మిషన్ అని కూడా అంటారు. ఎందుకంటే, ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేసే స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ తరువాత అజయ్ దేవగన్ మాత్రమే. ప్రస్తుతం యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మిస్తున్న ఓ చిత్రంలో అజయ్ దేవగణ్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు.

Also Read: వక్షోజాలు చూసి సర్జరీ చేయించుకో అన్నారు – ‘ప్రియాంక చోప్రా’

అయితే ఈ మధ్య ఈ స్టార్ హీరో ఎక్కువుగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తున్న భామలతో జతకడుతూ వస్తున్నాడు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చి.. బాలీవుడ్ లో ఆమె కెరీర్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్నాడు అజయ్. హోమ్లీ బ్యూటీ ప్రణీత సుభాష్ కు తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నాడు. అజయ్ దేవగణ్ పక్కన హీరోయిన్ అంటే.. ప్రణీతకు బాగా ప్లస్ అయ్యే అంశమే.

Also Read: భర్తతో విడాకులు.. వ్యభిచారిణి పాత్రలో హీరోయిన్ !

ఇప్పటికే తన కెరీర్ లో ప్రణీత ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో పవన్ పక్కన నటించి తెలుగులో బాగానే గుర్తింపు పొందింది. కాకపోతే, ఆ సినిమా వల్ల ఆమెకు పెద్దగా ఆఫర్లు అయితే రాలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా అజయ్ దేవగణ్ కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి, కనీసం ఈ సినిమానైనా ఆమెకు స్టార్ డమ్ ను తెస్తోందేమో చూడాలి. ‘బుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో ఆమె అజయ్ దేవగన్ కి జోడిగా నటించబోతుంది. ఇక ప్రణీతకి తెలుగులో కెరీర్ ఎండ్ అయినట్లే, మరి బాలీవుడ్ లోనైనా లక్ కలిసి వస్తోందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్