https://oktelugu.com/

Balakrishna Akhanda: బాలయ్య ‘అఖండ’ రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు !

Balakrishna Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా రికార్డ్స్ మాత్రం ఆగడం లేదు. అసలు సినిమా 50 రోజులు ఆడటం అనే కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. అలాంటిది ఈ సినిమాకి 50 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది. పైగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా రూ.కోటి కలెక్షన్లు రాబట్టింది. కోటి కలెక్షన్స్ అంటే […]

Written By: , Updated On : January 24, 2022 / 09:21 AM IST
Follow us on

Balakrishna Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా రికార్డ్స్ మాత్రం ఆగడం లేదు. అసలు సినిమా 50 రోజులు ఆడటం అనే కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. అలాంటిది ఈ సినిమాకి 50 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది. పైగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా రూ.కోటి కలెక్షన్లు రాబట్టింది.

Akhanda

Akhanda

కోటి కలెక్షన్స్ అంటే ఇది మాములు రికార్డ్ కాదు. ఒక ఏరియాలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టడం గొప్ప విషయం. ఇటీవల బాలకృష్ణ కూడా అక్కడికి వెళ్లారు. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అన్నట్టు థియేటర్స్ కే ఈ సినిమా పరిమితం కాలేదు. ఓటీటీలోనూ కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది.

Also Read:  టాలీవుడ్ సోషల్ మీడియా క్రేజీ అప్ డేట్స్ !

Akhanda collection

Akhanda collection

అఖండ మూవీ థియేటర్లతో పాటు ఓటీటీ లోనూ అదరగొడుతోంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన సినిమాగా కూడా ఇది రికార్డ్స్ ను సెట్ చేసింది. ఇక ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా పూర్తయ్యాక వచ్చే ఈ వీడియోను సపరేట్‌గా విడుదల చేయగా.. దానికి కూడా లక్షల వ్యూస్ వస్తున్నాయి. షూటింగ్‌లో బాలయ్యకు బోయపాటి సీన్లను వివరిస్తున్న సందర్భాలు ఈ మేకింగ్ వీడియోలో ఉన్నాయి. మొత్తమ్మీద అఖండ రికార్డ్స్ ఆగేలా లేవు.

Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ వదిలే డేట్ కి రాధేశ్యామ్ వస్తాడట !

Tags