https://oktelugu.com/

Jayasudha: సహజ నటితో సహజమైన ముచ్చట్లు !

Jayasudha: సహజమైన నటనకు జయసుధ బ్రాండ్ అంబాసిడర్. నటనలో సహజత్వం ఉండాలనే నియమం ఆమె నుంచే బలపడింది. తన హావభావాలతో ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఎంతమంది ఉన్నా.. సహజ నటి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జయసుధ. ప్రస్తుతం జయసుధ అమెరికాలో ఉంది. అయితే, తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంగతులు చెప్పుకొచ్చింది. మరి ఆ సంతులు ఏమిటో జయసుధ మాటల్లోనే విందాం. జయసుధ మాట్లాడుతూ.. ‘నేను అమెరికా వచ్చి అయిదు నెలలయింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : January 24, 2022 / 09:14 AM IST
    Follow us on

    Jayasudha: సహజమైన నటనకు జయసుధ బ్రాండ్ అంబాసిడర్. నటనలో సహజత్వం ఉండాలనే నియమం ఆమె నుంచే బలపడింది. తన హావభావాలతో ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఎంతమంది ఉన్నా.. సహజ నటి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జయసుధ. ప్రస్తుతం జయసుధ అమెరికాలో ఉంది. అయితే, తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంగతులు చెప్పుకొచ్చింది. మరి ఆ సంతులు ఏమిటో జయసుధ మాటల్లోనే విందాం.

    Jayasudha

    జయసుధ మాట్లాడుతూ.. ‘నేను అమెరికా వచ్చి అయిదు నెలలయింది. ఎంతో మంది విభిన్నమైన వ్యక్తులను కలిసి, వారితో ఎంతో సరదాగా గడిపాను. నా ఈ ప్రయాణంలో చక్కని అనుభూతులు ఉన్నాయి. ఇక్కడ జనానికి వయసుతో సంబంధం లేదు. వాళ్లకు జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో బాగా తెలుసు. ఇక దేవుడు చాలా గొప్పవాడు.. కరోనా కాలంలో కూడా ఇప్పటి వరకు నన్ను సురక్షితంగా ఉంచాడు’ అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.

    Also Read:  రవితేజ నుంచి ఆరు సినిమాల సర్ ప్రైజ్ లు !

    అన్నట్టు.. ‘మీరెందుకు ఓటీటీలలో నటించడం లేదు?’’ అని అడిగితే.. జయసుధ సమాధానం చెబుతూ.. ‘నేనిప్పుడు కొత్తగా ఆడిషన్స్‌కు ఇచ్చి.. సినిమాలు చేయలేను కదా?’’ అయితే, నాకు మహిళల ఇబ్బందులు తెలియజెప్పేలా సినిమా చేయాలని ఉంది. మనమెందుకు దర్శకత్వం చేయకూడదు?’ అని అనిపిస్తుంది. అంతలోనే ‘ఇప్పుడు ఈ వయసులో డైరెక్షనా?’ అనే భయం కూడా కలుగుతుంది. వయసు అనేది అసలు అడ్డు కాదు, కాబట్టి తప్పకుండా చేస్తాను.

    jayasudha

    జయసుధ తన సినీ జీవితం గురించి చెబుతూ.. నేను సినిమాల్లోకి రావడానికి కారణం.. నటి, నిర్మాత అయిన విజయనిర్మల గారు. ఆమె నాకు స్వయానా మేనత్త. ఆమె సాయంతోనే 1972 లో వచ్చిన పండంటి కాపురం సినిమాలో నేను మొదటిసారి నటించాను. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు ఉన్నాయి. అలాగే 8 మలయాళ సినిమాలతో పాటు 3 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.

    Also Read:  ప్రభాస్  ‘సలార్’లో  విజయ్ దేవరకొండ హీరోయిన్ !       

    Tags