https://oktelugu.com/

RGV Tweet: ఎన్టీఆర్ కి క్యాసినోకి లింక్ ఎలా.. ? వర్మ బాలయ్యకి ఏమి చెబుతాడో ?

RGV Tweet: ‘టీడీపీ వాళ్లకు సీనియర్ ఎన్టీఆర్‌ దేవుడు. అలాంటిది.. టీడీపీ వాళ్లు ముందు క్యాసినో విషయంలో ఎన్టీఆర్‌ ను ప్రశ్నించాలట. ఎప్పుడో చనిపోయిన ఎన్టీఆర్ కి క్యాసినోకి లింక్ పెట్టి ట్వీట్ చేశాడు వర్మ. గుడివాడ క్యాసినోపై టీడీపీ నేతలు చాలా రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల ఫై రాంగోపాల్ వర్మ స్పందించాడు. ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నా. ఎన్టీఆర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 24, 2022 / 09:30 AM IST
    Follow us on

    RGV Tweet: ‘టీడీపీ వాళ్లకు సీనియర్ ఎన్టీఆర్‌ దేవుడు. అలాంటిది.. టీడీపీ వాళ్లు ముందు క్యాసినో విషయంలో ఎన్టీఆర్‌ ను ప్రశ్నించాలట. ఎప్పుడో చనిపోయిన ఎన్టీఆర్ కి క్యాసినోకి లింక్ పెట్టి ట్వీట్ చేశాడు వర్మ. గుడివాడ క్యాసినోపై టీడీపీ నేతలు చాలా రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల ఫై రాంగోపాల్ వర్మ స్పందించాడు. ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నా. ఎన్టీఆర్ తన సినిమాలో ఆ పాటను అనుమతించారు.

    RGV

    కాబట్టి క్యాసినోపై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి’ అంటూ ఒక ట్వీట్ పెట్టాడు. పైగా ఆ ట్వీట్ తో పాటు యమగోల సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను’ వీడియో సాంగ్‌ ను కూడా ఆర్జీవీ పోస్ట్ చేశాడు. మరి ఆర్జీవీ ఎందుకు కావాలని కెలుక్కుంటూ ఇలా పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేస్తున్నాడో అర్ధం కావడం లేదు అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read:  సహజ నటితో సహజమైన ముచ్చట్లు !

     

    RGV

    బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి గెస్ట్ గా రావాలని ఆర్జీవీ ఆశ పడ్డాడు. ఈ అన్‌ స్టాపబుల్ షోకు నన్ను పిలవాలని, ‘ఈ షోలో నేను కూడా పాల్గొని మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే, బాలయ్య గారు ఆ అవకాశం నాకు ఇస్తారని ఆశిస్తున్నాను’ అని వర్మ ట్వీట్ చేసి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి బాలయ్య షో కి వర్మ వస్తే.. బాలయ్య ఈ ట్వీట్లు గురించి అడుగుతాడు. అప్పుడు వర్మ బాలయ్య ఏమి చెబుతాడో ?

    Also Read:  సీనియర్ హీరోకి కరోనా.. టెన్షన్ లో ప్రభాస్ !

    Tags