Homeఎంటర్టైన్మెంట్Daaku Maharaj : త్వరలో ఓటీటీలోకి రాబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ సెన్సేషన్.. దేనిలో స్ట్రీమింగ్ అవుతుందంటే...

Daaku Maharaj : త్వరలో ఓటీటీలోకి రాబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ సెన్సేషన్.. దేనిలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

Daaku Maharaj : నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందజేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం మాస్ యాక్షన్ ఫీల్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై, “డాకు మహారాజ్” సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, రూ.85 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా, అభిమానులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ వేదికపై కూడా విడుదలకు సిద్ధమైంది. “డాకు మహారాజ్” మూవీని నెట్‌ఫ్లిక్స్ 2025 ఫిబ్రవరి 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఓ పండుగలా మారనుంది. సినిమా థియేటర్లలలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. “డాకు మహారాజ్” సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సెట్ చేసుకుంది. ఆ అంచనాలకు తగినట్లే థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ సినిమాకు సంబంధించిన కథలో మాస్ యాక్షన్, రీస్కీ స్టంట్స్, బాలయ్యను ఓ కొత్త స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించడమే కాకుండా, సినిమా కథను ఆకర్షణీయంగా మార్చాయి. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ , ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. బాబీ డియోల్, షైన్ టామ్ చాకో, చాందినీ చౌదరి, మకరంద్ దేశ్‌పాండే వంటి ఇతర నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సంగీతం అందించిన థమన్ తన మ్యూజిక్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఓటీటీ వేదికపై ఈ సినిమాను చూడడానికి అభిమానులు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లలో పెద్ద విజయం సాధించిన “డాకు మహారాజ్” ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికపై మరింత హంగామా చేసేందుకు రెడీ అయిపోయింది.

“డాకు మహారాజ్” తరువాత బాలకృష్ణ “అఖండ 2” అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, దసరా సందర్భంగా విడుదల కావచ్చు. “డాకు మహారాజ్” తర్వాత “అఖండ 2” కూడా బాలయ్య కెరీర్లో ఒక పెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. జనవరి 12న డాకు మహారాజ్ రిలీజ్ కాగా సినిమా రిలీజైన 40 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అవుతుంది. థియేట్రికల్ లో హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version