Sai Pallavi -Vijay Devarakonda
Sai Pallavi : న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తమిళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సినీ ప్రియులందరినీ తన నటన, అందంతో ఫిదా చేసింది. ఆ తర్వాత పలు డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అవకాశాలు భారీగా వస్తున్నా ఏది పడితే అది చేయకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. కథా బలం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకుంది. ముందు తను డ్యాన్సర్ కావడంతో సాయి పల్లవి నటనతోనే డ్యాన్స్ తో కూడా ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తుంది. అయితే, ఈ న్యాచురల్ బ్యూటీ ఓ పట్టాన సినిమాలకు ఒకే చెప్పదని. తనకు కథ నచ్చి పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే తప్ప సినిమాలో నటించేందుకు ఓకే చెప్పదన్న టాక్ ఉంది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా తన హద్దు దాటకుండా.. కేవలం నటనతోనే అమ్మడు రాణిస్తోంది.
సాయిపల్లవి గురించి ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ వార్త కూడా ప్రచారం కాలేదంటే తను ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు. తన పని తాను చేసుకుని పోతుంటుంది . ఈ మాట ఒకరు ఇద్దరు కాదు తనతో పని చేసి ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. ఇటీవల ఆమె బ్యాక్ టు బ్యాక్ “అమరన్, తండేల్” సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దీంతో సాయి పల్లవికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి ఏ కథ ఎంచుకున్నా అది హిట్ అవ్వాల్సిందేనని సాయి పల్లవి ఒక సినిమాకి కమిట్ అయిందంటే .. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్లేనన్న టాక్ నడుస్తుంది. కాగా చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్నప్పటికీ ఆ సినిమా కథలు నచ్చక సాయి పల్లవి రిజెక్ట్ చేసింది . ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ అందరిని రిజెక్ట్ చేసే సాయి పల్లవిని ఒక తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రిజెక్ట్ చేశాడట. అప్పట్లో ఈ హీరో పేరు మారుమ్రోగిపోయింది.
హీరోలతో సమానంగా ప్రస్తుతం సాయి పల్లవికి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో తనకు నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. వాస్తవానికి హద్దులు దాటే గ్లామర్ షోకు సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఇదే సాయి పల్లవికి ఇండస్ట్రీలో స్పెషల్ స్థానాన్ని తెచ్చిపెట్టింది. అలాంటి సాయిపల్లవిని రిజెక్ట్ చేసిన హీరో మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ . టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు జనాలు చూడడానికి ఆసక్తి చూపుతారు. కాగా విజయ్ దేవరకొండ నటించిన “ది ఫ్యామిలీ స్టార్” సినిమాలో మొదటగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కన్నా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే సాయి పల్లవి ఈ సినిమా చేస్తుందన్న నమ్మకాలు ఎక్కువగా ఉన్న విజయ్ దేవరకొండ మాత్రం నో చెప్పారట . ఎంత ఫామిలీ డ్రామా అయినా కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండాలి అలా ఉంటేనే కలిసి వస్తుంది. ఈ సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది కాబట్టి ఆమె చేయదు.. అడిగి నో చెప్పించుకోవడం కన్నా మనమే రిజెక్ట్ చేస్తే మంచిదంటూ సాయి పల్లవి వద్దు అని రిజెక్ట్ చేసేసారట . దీంతో సాయి పల్లవి ని రిజెక్ట్ చేసి నిలిచిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలిచిపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణం’ చిత్రం తెరకెక్కబోతున్నది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించనుంగా.. సీత పాత్రకు సాయి పల్లవిని తీసుకున్నారు.