Yashasvi Jaiswal
Yashasvi Jaiswal : దూకుడుగా బ్యాటింగ్ చేసే యశస్వి జైస్వాల్ ను టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో నాన్ ట్రావెల్ ప్లేయర్ గా ఎంపిక చేసింది. జట్టు అవసరాల దృష్ట్యా మాత్రమే అతడు దుబాయ్ బయలుదేరాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్న ఆటగాళ్లు మెరుగ్గా ఆడితే యశస్వి జైస్వాల్ కు అవకాశం లభించదు. ఒక రకంగా చెప్పాలంటే జట్టుకు ఎంపికై ఎంపిక కానట్టే.. వాస్తవానికి అతని రికార్డులు చూస్తే కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలి. కానీ ఏం జరిగిందో తెలియదు.. మొత్తానికి యశస్వి జైస్వాల్ ఛాంపియన్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.. నాన్ ట్రావెల్ ప్లేయర్ గా మాత్రమే ఎంపికయ్యాడు.. అతనికంటే అనామకమైన రికార్డులు ఉన్న ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యారు. మెగా టోర్నీలకు ఎంపిక కాని ఆటగాళ్లు కచ్చితంగా రంజి మ్యాచులు ఆడాలని ఇటీవల బీసీసీఐ నిబంధనలను జారీ చేసింది. ఆ ప్రకారం యశస్వి జైస్వాల్ ఇప్పుడు రంజిలో ఆడాల్సి ఉంటుంది.. కానీ అతడు ఇప్పుడు రంజి కాటం లేదు.. దీనికి కారణం అతడి కాలి మడమకు గాయం కావడమే. అందువల్లే అతడు సెమిస్ మ్యాచ్ ఆటం లేదని తెలుస్తోంది..
ముంబై తరఫున..
యశస్వి జైస్వాల్ ముంబై జట్టు తరపున రంజి ఆడుతున్నాడు. కీలకమైన సెమిస్ మ్యాచ్లో అతడు ఆడక పోవడం ముంబై జట్టుకు ఒక రకంగా దెబ్బ. సెమిస్ మ్యాచ్లో ముంబై జట్టు విదర్భతో ఆడాల్సి ఉంది. కీలకమైన ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఆడకపోవడం ముంబై జట్టుకు ఇబ్బంది కలిగించే పరిణామం. సోమవారం నుంచి విదర్భ, ముంబై జట్ల మధ్య సెమిస్ మ్యాచ్ జరుగుతుంది. కీలకమైన ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కు గాయం కావడం అతని అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. ” ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అంచలంచలుగా ఎదిగాడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు జట్టులో అవకాశాన్ని కోల్పోయాడు. తనను తాను నిరూపించుకోవడానికి రంజీలో ఆడుతున్నాడు. కానీ కీలకమైన మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. ఇది ఒక రకంగా ముంబై జట్టుకు ఇబ్బందే. అంతేకాదు యశస్విస్వి జైస్వాల్ కు కూడా ఇబ్బందే. అతడు త్వరగా కోలుకొని ఆడితే బాగుంటుంది. కానీ అతడు సెమిస్ మ్యాచ్లో ఆడేది అనుమానమే. ఒకవేళ సెమీస్ మ్యాచ్లో కనుక ముంబై జట్టు విజయం సాధిస్తే.. ఫైనల్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని” యశస్వి జైస్వాల్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
గౌతమ్ గంభీర్ పై ఆగ్రహం
ఇటీవల భారత మేనేజ్మెంట్ ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీలో యశస్వి జైస్వాల్ కు చోటు లభించకపోవడంతో.. అతని అభిమానులు గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాలలో విమర్శలు చేశారు. గౌతమ్ గంభీర్ యశస్వి జైస్వాల్ కెరియర్ తో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. వర్ధమాన ఆటగాడికి అవకాశాలు ఇవ్వకుండా.. ప్రయోగాలు చేయడం ఏంటని ఆరోపించారు. ఐసీసీ నిర్వహిస్తున్న మెగా టోర్నీలో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ గౌతమ్ గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశారు.