శ్రీకాంత్ ను హెచ్చరించిన బాలక్రిష్ణ

నందమూరి బాలక్రిష్ణ ముక్కుసూటి తనం ఏపాటిదో మనం ఎన్నో వీడియోల్లో చూశాం. ఆయనకు నచ్చిందే చేస్తాడు. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే చెంప పగులకొడుతాడు. సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ క్యారెక్టర్లు వేస్తాడో.. బయట కూడా అంతే పవర్ ఫుల్ గా ప్రవర్తిస్తారు. రాజకీయాల్లోకి వచ్చినా బాలయ్య ‘చెంప చెల్లుమనిపించడాలు తగ్గలేదు’. హీరో శ్రీకాంత్ విషయంలోనూ బాలయ్య అలాగే ప్రవర్తించాడని తెలిసింది. ఈ విషయాన్ని తాజాగా బాలయ్యే చెప్పుకొచ్చాడు. తనకున్న అనుభవంతో ఇటీవల శ్రీకాంత్ కు ఒక విషయంలో […]

Written By: NARESH, Updated On : June 12, 2021 9:05 am
Follow us on

నందమూరి బాలక్రిష్ణ ముక్కుసూటి తనం ఏపాటిదో మనం ఎన్నో వీడియోల్లో చూశాం. ఆయనకు నచ్చిందే చేస్తాడు. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే చెంప పగులకొడుతాడు. సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ క్యారెక్టర్లు వేస్తాడో.. బయట కూడా అంతే పవర్ ఫుల్ గా ప్రవర్తిస్తారు. రాజకీయాల్లోకి వచ్చినా బాలయ్య ‘చెంప చెల్లుమనిపించడాలు తగ్గలేదు’.

హీరో శ్రీకాంత్ విషయంలోనూ బాలయ్య అలాగే ప్రవర్తించాడని తెలిసింది. ఈ విషయాన్ని తాజాగా బాలయ్యే చెప్పుకొచ్చాడు. తనకున్న అనుభవంతో ఇటీవల శ్రీకాంత్ కు ఒక విషయంలో గట్టిగానే హెచ్చరించాడట బాలక్రిష్ణ.

శ్రీకాంత్ పై బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హీరోగా వెలుగు వెలిగిన శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గానూ చేస్తున్నాడు. క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్నాడు. దీనిపై బాలయ్య హెచ్చరించాడట..

విలన్స్ రోల్ చేయడానికి వీల్లేదని.. ఇంకా దానికి చాలా టైమ్ ఉందని శ్రీకాంత్ కు బాలయ్య గట్టిగా చెప్పాడట.. విలన్ గా పక్కన పెట్టి మీరోగా చేయండని తాను శ్రీకాంత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు బాలయ్య తెలిపాడు. తాను కొన్ని సినిమాలకు సజెస్ట్ చేస్తానని చెప్పినట్టు వివరణ ఇచ్చాడు. విలన్ గా మరోసారి చేస్తే బాగుండదు.. జాగ్రత్త రిపీల్ చేయకు అని శ్రీకాంత్ ను మందలించాడట.. ఇలా హీరోకే వార్నింగ్ ఇచ్చిన బాలయ్య వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.