Unstoppable Season 3
Unstoppable Season 3: బాలయ్య సినిమా వస్తుందంటే విజిల్స్ పక్కా. థియేటర్లలో పేపర్లు చినగడం పక్కా. ఫాక్షన్ మూవీస్, ఫ్యామిలీ ఎంటర్లైనర్ ఏదైనా నేను రెడీ అంటాడు ఈ నందమూరి హీరో. వయసుతో సంబంధం లేదు, బొమ్మ పడిందా మీ చెవులు, కళ్లు మొత్తం సినిమా మీదనే ఉండాలంతే.. అని చెప్పకనే చెబుతారు ఈ స్టార్ హీరో. అదీ మరీ బాలయ్య రేంజ్ అంటే..తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఇండియాలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు బాలకృష్ణ. సినిమాలు అయితే ఓ గంట, రెండు గంటలు ఉంటాయి. అది కూడా ఒక సినిమా విడుదల అయితే మరో సినిమా రావడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు అప్డేట్స్ కోసం వెయిట్ చూస్తూ ఉండడం తప్ప అభిమానులు ఏం చేస్తారు? ఎదురుచూడడం తప్పా.. కానీ ఇప్పుడు షోలు అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ స్టార్ హీరో. అదేనండి అన్ స్టాపబుల్ షో తో ఇంతకు ముందుకు రెండు సార్లు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి రాబోతున్నారు.. ఓహో… వింటేనే ఆనందంగా ఉంది కదూ.. మరి ఆలస్యం ఎందుకు వివరాల్లోకి వెళ్దాం పదండి…
ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, హిట్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ గేమ్ షోలు, ఆపై టాక్ షోలు అంటూ దూసుకుపోతున్న ఫేమస్ ఓటీటీ సంస్థ ఆహా. ఆహా.. అన్ స్టాపబుల్.. ఈ రెండింటింకి లింక్ మీకు తెలిసిందే. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో నిర్వహిస్తే.. దానికి హోస్ట్ గా మన బాలయ్య బాబు ఉంటారు. మరి ఈ షో ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ హౌస్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఈ టాక్ షో.
సూపర్ హీరోలు, రాజకీయ నాయకులు ఈ టాక్ షోకు హాజరై నవ్వించారు, తమ కష్టాలను వెల్లడించారు. ఇందులోనూ బాలయ్య తన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. గెస్టులు ఎవరైనా రాని ప్రశ్నల వర్షం కురిపిస్తూ..తికమక పెడుతూ ఓ ఆట ఆడుకుంటారు. అదే విధంగా ప్రేక్షకులను నవ్విస్తూ అలరించడంలో కూడా ముందుటారు. అలాంటి బాలయ్య బాబు షో ఆగిపోవడంతో ప్రేక్షకులు డల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ ఫీల్ ను పక్కన పెట్టి స్మాట్ టీవీల ముందు కూర్చోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 3 రాబోతుంది.
మరింత జోష్ తో అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలు పెట్టనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే సీజన్ 3 కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సీజన్ లో మరికొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్య మరింత జోష్ గా ఈ సీజన్ ను నడిపించనున్నారట. అంతేకాదు ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇందులో నందమూరి హీరో హోస్ట్ అయితే ఒకసారి మెగాస్టార్ గెస్ట్ గా వస్తారట. అబ్బ తలుచుకుంటేనే బాగుంది కదా.. బాలయ్య, చిరు కాంబినేషన్ లో ఒకరోజు షో అంటే అభిమానులకు పండగ అనుకోండి. చూద్దాం వీరి మద్య ఎలాంటి సంభాషణ ఉంటుంది? బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగి తికమక పెడుతారు? దానికి మెగాస్టార్ ఎలా సమాధానం ఇస్తారు అనేది చూడాలంలే వెయిట్ చేయాల్సిందే. కానీ మొత్తం మీద రాజకీయాల్లో మాత్రమే బిజీ అవుతారు అనుకున్న బాలయ్య, ఇప్పుడు షోలతో అలరించడానికి సిద్దం అవడంతో ప్రేక్షకులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.