Sreeleela: కన్నడ బ్యూటీ శ్రీలీల గురించి పరిచయమే అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలు కానీ ఊహించని రేంజ్ లో పాపులర్ అయిపోయింది అమ్మడు. కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రజల మనుసులో స్థానం సంపాదించింది. పెళ్లి సందడి సినిమా నుంచి ఇప్పటి వరకు అపజయం ఎరుగని హీరోయిన్ గానే నిలుస్తుంది. మొదటి సినిమానే మంచి టాక్ సంపాదించడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది ఈ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది.
శ్రీలీల నటన, డాన్స్ తో అలరించడంలో ముందుంటుంది. తెలుగులో శ్రీలీల పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే ఇతర సినిమాల ప్రమోట్ చేసుకోవడానికి శ్రీలీలని ఆహ్వానిస్తున్నారు. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన ఫెవెరెట్ హీరో ఎవరో తెలిపింది. అయితే రీసెంట్ గా మ్యాడ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా హాజరైంది శ్రీ.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు శ్రీలీలతోపాటు సిద్దూజొన్నలగడ్డ, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. మరి ఈవెంట్ కు వచ్చాకా సైలెంట్ గా కూర్చొని వెళ్తారా? ఏదో ఒకటి మాట్లాడే వెళ్తారు కదా.. కానీ ఈ అమ్మడు ఏకంగా తన అభిమాన హీరో దుల్కర్ సల్మాన్ అని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు దుల్కర్ వైపు చూస్తూ.. సార్ మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పినప్పుడు మా అమ్మ చాలా సంతోషించింది. మిమ్మల్ని అడిగాను అని చెప్పమంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. “నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది. మా అమ్మమ్మ చెప్పిన కథలు విన్నప్పుడు.. గుర్రం మీద వస్తున్న యువరాజుని ఊహించుకున్నాను, మీ ‘హీరేయ్’ పాట చూసినప్పుడు, మీరే నా రాకుమారుడు అని అనుకున్నాను అంటూ శ్రీ తెలపడంతో అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు దుల్కర్ సల్మాన్ కూడా చిన్నగా నవ్వి, ధన్యవాదాలు అంటూ తెలిపాడు.