బాలకృష్ణ అఖండ సినిమా తరువాత, గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ ను బుక్ చేయాలని డైరెక్టర్ తెగ ప్రయత్నం చేస్తోన్నా.. ఏ స్టార్ హీరోయిన్ సెట్ అయ్యేలా కనిపించడం లేదు. శృతి హాసన్, బాలకృష్ణ సరసన నటించడానికి అంగీకరించిందని వార్తలు వచ్చినా అది నిజం కాదని తెలుస్తోంది.
దర్శకుడు గోపీచంద్ మలినేనికి శృతి హాసన్ తో మంచి బంధం ఉంది. ఆ చనువుతో ఆమెను ఒప్పించాలని అనుకున్నప్పటికీ, శృతి హాసన్ బాలయ్య అనగానే ఇంట్రెస్ట్ చూపించలేదట. గోపీచంద్ తన ‘క్రాక్’ సినిమాతో శృతి హాసన్ కి మంచి హిట్ ఇచ్చినా.. ఆమె మాత్రం గోపీచంద్ మాటను కూడా కాదు అనేసింది. అందుకే ఇప్పుడు మరో హీరోయిన్ కోసం గోపీచంద్ మలినేని చూస్తున్నాడు.
ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ త్రిష ఖాళీగా ఉందని తెలిసింది. ఆమె గతంలో బాలయ్యతో ఆల్ రెడీ ఒక సినిమా చేసింది. సో.. ఇప్పుడు ఎలాగూ తనకు సినిమాలు లేవు కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లో బాలయ్య సినిమాని రిజెక్ట్ చేయదు. అందుకే ప్రస్తుతం ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్,
ఒకవేళ త్రిషకు కూడా బాలయ్య పక్కన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోయినా రెమ్యూనరేషన్ కోసమైనా ఒప్పుకుంటుంది. ఎలాగూ త్రిషకు ‘సీనియర్ హీరోయిన్’ అనే ముద్ర ఎప్పుడో పడింది. బాలయ్య సరసన ఇప్పుడు నటించినా వచ్చే నష్టం ఏమి లేదు. అయినా 38 ఏళ్ల త్రిషకి బాలయ్య లాంటి హీరో తప్ప, హీరోయిన్ గా ఏ యంగ్ హీరో మాత్రం ఛాన్స్ ఇస్తాడు. కాబట్టి ఈ సీనియర్ హీరోయిన్ కి బాలయ్య ఒక్కరే ఆప్షన్.