సినీ పెద్దలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇండస్ట్రీ పెద్దల మధ్య వర్గ విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో చిరంజీవి తదితరులు భేటీపై అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇలా సమావేశమై హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారా? అని ఆయన కామెంట్ చేయడం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, షూటింగ్‌లు, సినిమా […]

Written By: Neelambaram, Updated On : May 28, 2020 4:03 pm
Follow us on


టాలీవుడ్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇండస్ట్రీ పెద్దల మధ్య వర్గ విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో చిరంజీవి తదితరులు భేటీపై అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇలా సమావేశమై హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారా? అని ఆయన కామెంట్ చేయడం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, షూటింగ్‌లు, సినిమా థియేటర్ల ప్రారంభ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి చిరంజీవి నివాసంలో చర్చలు జరిపారు. నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్‌ సహా పలువురు నిర్మాతలు, దర్శకులు ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ తో సమవేశమయ్యారు. ఈ రెండు భేటీలకు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని, అన్నీ తానై వ్యవహరించారు.

అయితే, సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల విషయం తనకు తెలియదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరిగిన విషయం తాను పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నానని చెప్పారు. జూన్‌లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు. ఎక్కువ శాతం షూటింగ్‌లు పూర్తయిన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని సూచించారు. అలాగే, సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ భేటీలకు రావాలని తనను ఎవ్వరూ పిలువలేదని చెప్పారు. మంత్రి తలసానితో కూర్చొని హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారేమో అని వ్యంగ్యంగా మాట్లాడారు.

కాగా, బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ స్పందించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని కల్యాణ్ చెప్పారు. సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దల భేటీకి బాలకృష్ణని పిలవాల్సిన బాధ్యత ‘మా’ అసోసియేషన్‌దే అని అన్నారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి మాత్రం మంత్రి తలసాని చొరవ తీసుకున్నారని కళ్యాణ్ చెప్పారు. సినిమా రంగంలో విభేదాలు లేవని, అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు