Balakrishna : సుమారుగా 50 సంవత్సరాల నుండి హీరోగా కొనసాగుతూ, ఇప్పటికీ నేటి తరం హీరోలతో సమానంగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ఇండస్ట్రీ ని షేక్ చేసే రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయనకు నిన్న పౌర సన్మాన సభ ని నిర్వహించారు. ఈ సభలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా లో ట్రోల్స్ కూడా జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి అంటూ బాలయ్య మాట్లాడిన మాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : ఒకే వేదిక పైకి ప్రధాని మోదీ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్!
ఆయన మాట్లాడుతూ ‘సినీ రంగానికి నేను చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం నాకు పద్మభూషణ్ అవార్డుని అందించింది. అందుకు ఎంతో సంతోషం. కానీ త్వరలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ని ప్రకటించాలి. ఇది కేవలం ఆయనకు గౌరవం ఇచ్చినట్టు కాదు, తెలుగు జాతికి గౌరవం ఇచ్చిన్నట్టు. ప్రతీ తెలుగోడి ఆకాంక్ష, కచ్చితంగా అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఎన్టీ రామారావు(Nandamuri Taraka Rama Rao) గారికి ‘భారత రత్న’(Bharata Ratna) ఇచ్చినప్పుడే వాళ్లకి వాళ్లకు గౌరవం ఇచ్చుకున్నట్టవుతుంది అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. నిజంగా తెలుగు జాతి గర్వపడేలా చేసిన ఎన్టీఆర్ కి కచ్చితంగా భారతరత్న తో సత్కరించుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కి కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే దక్కింది. ఇది దేశం లో మూడవ అత్యున్నత పురస్కారం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇది చాలా తక్కువ పురస్కారంగా భావించవచ్చు.
ఎన్టీఆర్ సాధించిన దాంట్లో ఆవగింజంత కూడా సాధించని ఎంతో మంది నటీనటులు, రాజకీయ నాయకులు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలను కూడా అందుకున్నారు. ఈ దేశం లో ర్యాంకింగ్ పరంగా పురస్కారాలను చూసుకుంటే భారతరత్న అత్యున్నత పురస్కారం. ఆ తర్వాతి స్థానం లో పద్మవిభూషణ్, ఆ తర్వాతి స్థానంలో పద్మభూషణ్, ఇక చివరి స్థానం లో పద్మశ్రీ. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ పోషించని పాత్ర అంటూ ఏది మిగలలేదు. బహుశా ప్రపంచం లో దేవుడి క్యారెక్టర్స్ ఎన్టీఆర్ కి సూట్ అయ్యేట్టు ఏ నటుడికి కూడా సూట్ అవ్వదు. ఆరోజుల్లో ఆయన రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు ఇలాంటి క్యారెక్టర్స్ వేసినప్పుడు, బహుశా దేవుళ్ళు ఇలాగే ఉండేవారేమో అని జనాలు అనుకునేవారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏకచక్రాధిపత్యంతో ముందుకు దూసుకుపోతున్న సమయం లో, తెలుగు దేశం పార్టీ ని పెట్టి, కేవలం 8 నెలల కాలంలోనే అధికారం లోకి తీసుకొచ్చాడు. రాష్ట్రానికి ఎన్నో అద్భుతమైన సేవలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తే, ఆ అవార్డుకే వన్నె తెచ్చినట్టు అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : ఒకే వేదిక పైకి ప్రధాని మోదీ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్!
“నాకు పద్మభూషణ్ ఇచ్చారు… సరే, సంతోషం.
ఎన్టీ రామారావు గారికి ‘భారత రత్న’ ఇచ్చినప్పుడే వాళ్లు వాళ్లకు గౌరవం ఇచ్చుకున్నట్టవుతుంది అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా.#NTR గారికి భారత రత్న రావడం ప్రతి తెలుగు వాడి కోరిక.” pic.twitter.com/QLHHLwVBVw
— Gulte (@GulteOfficial) May 4, 2025