Nandamuri Balakrishna : సుమారుగా 5 దశాబ్దాల నుండి హీరో గా రాణిస్తూ, ఎన్నో అద్భుతమైన విజయాలను సినీ హీరో గా అందుకొని, ఎన్టీఆర్ కొడుకుగా ఆయన పేరుని నిలబెట్టిన హీరో నందమూరి బాలకృష్ణ. కేవలం హీరో గా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎంతో మంది పేదలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్యం అందించాడు. ఇక రాజకీయనాయకుడిగా అయితే హిందూపురం లో వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎంపికై చరిత్ర సృష్టించాడు. తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్స్ వచ్చేంత గడ్డు కాలంలో కూడా బాలయ్య బాబు హిందూపురం నుండి ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యాడంటే, జనాల్లో ఆయన మీద ఉన్న విశ్వాసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం బాలయ్య ని గుర్తించి పద్మభూషణ్ అవార్డు ని అందించడం పై ఆయన అభిమానులు పట్టరాని ఆనందం లో ఉన్నారు.
Also Read : ఒకే వేదిక పైకి ప్రధాని మోదీ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్!
రీసెంట్ గానే ఆయన కుటుంబ సమేతంగా ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ కి తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు తో వెళ్లి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడం వంటివి కూడా మనమంతా చూసాము. ఇప్పటికే బాలయ్య బాబు కి పద్మభూషణ్ వచ్చినందుకు ఇండస్ట్రీ తరుపున ఒక సన్మాన సభని ఏర్పాటు చేసారు. నిన్న మరోసారి ఆయనకు పౌర సన్మాన సభని నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వివాదాలకు దారి తీశాయి. ఆయన మాట్లాడుతూ ‘సినీ నటులు అయినవాళ్లంతా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని లేదు. ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు. నేను ఎమ్మెల్యే గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాను, అందుకే ప్రజలు నన్ను గెలిపించారు. రామారావు గారి అబ్బాయిని అయ్యినంత మాత్రానా గెలిచేస్తానని కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.
దీనిపై చిరంజీవి(Megastar Chiranjeevi) ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా ఇది చిరంజీవి కి పరోక్ష కౌంటర్ అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ తో కలిసి వెళ్తున్నప్పుడు కూడా బాలయ్య మిత్ర బంధం పాటించకుండా, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. జనసేన పార్టీ లేకపోతే తెలుగు దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు, కూటమి అధికారం లోకి రావడానికి సింహ భాగం పవన్ కళ్యాణ్ ఇచ్చిన కూడా ఒక కారణం అని , మా మద్దత్తు తో గెలిచి, మా మీదనే ఇలా సెటైర్స్ వేస్తారా అని కోపం తెచ్చుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ప్రతీ దానిని భూతద్దం లో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బాలయ్య ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ లాగా అసలు అనిపించలేదు. కేవలం ఫ్లో లోనే మాట్లాడాడు అంటూ సోషల్ మీడియా లో కూటమి పెద్దలు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : పద్మభూషణ్ NBK.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్!
Manalne na ? Manalni kaadhu le
pic.twitter.com/1FaQ6UEHoO— NBK Cult (@iam_NBKCult) May 4, 2025