https://oktelugu.com/

బన్నీబాబు ముందు వైజాగ్ లో ప్రత్యక్షమవుతాడట

అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. 2018లో చేసిన ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ రెండేళ్లపాటు నిరీక్షించి బన్నీతో ఈ సినిమా కమిటయ్యారు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అట్టహాసంగా సినిమా షూటింగ్ మొదలైంది. కేరళలోని అడవుల్లో చిత్రీకరణ పెట్టుకున్నారు. కానీ కోవిడ్ లాక్ డౌన్ మూలంగా అది కాస్త ఆగిపోయింది. సుమారు ఆరు నెలల తర్వాత షూట్ మొదలుకానుంది. Also Read: సంచలన ఆరోపణ: యాంకర్ వర్షిణి చేయిపట్టి […]

Written By: , Updated On : October 27, 2020 / 05:18 PM IST
Follow us on

Allu Arjun Pushpa latest updates
అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. 2018లో చేసిన ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ రెండేళ్లపాటు నిరీక్షించి బన్నీతో ఈ సినిమా కమిటయ్యారు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అట్టహాసంగా సినిమా షూటింగ్ మొదలైంది. కేరళలోని అడవుల్లో చిత్రీకరణ పెట్టుకున్నారు. కానీ కోవిడ్ లాక్ డౌన్ మూలంగా అది కాస్త ఆగిపోయింది. సుమారు ఆరు నెలల తర్వాత షూట్ మొదలుకానుంది.

Also Read: సంచలన ఆరోపణ: యాంకర్ వర్షిణి చేయిపట్టి లాగిన డైరెక్టర్

ఈ చిత్రీకరణను కూడ అడవుల్లోనే జరపాల్సి ఉంది. అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలను సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. నవంబర్ మొదటి వారంలో షూట్ మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఈలోపు వైజాగ్లో కొంత భాగం చిత్రీకరణను జరపాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ మొదటి వారంలో విశాఖకు వెళతారట.

Also Read: 10లక్షలు కట్టించుకున్న జబర్దస్త్.? నాగబాబు పంచ్..!

అంటే బన్నీబాబు లాక్ డౌన్ తర్వాత మొదటగా ప్రత్యక్షమవబోయ్యేది విశాఖలోనే. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ రెడ్ శాండల్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ డీగ్లామర్ లుక్ చేసుకున్నారు బన్నీ. భారీ బడ్జెట్ కేటాయించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ రాశానికా మందన్న కథానాయకిగా నటిస్తోంది.