Balakrishna: నట సింహం బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’, ఈ సినిమా టైటిల్ ను కూడా మొదట ‘వీరసింహారెడ్డి’గానే పెట్టాలని ఆలోచించారు మేకర్స్. తాజాగా ‘నరసింహారెడ్డి`, `అన్నగారు` పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రెండు టైటిల్స్ లో ఎదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం `అన్నగారు` టైటిల్ కే బాలయ్య ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు.

`నరసింహారెడ్డి` టైటిల్ బాగానే ఉన్నా.. పాత వాసన కొడుతోంది. పైగా `రెడ్డి` అని పెట్టడం బాలయ్యకి అస్సలు ఇష్టం లేదు. అదే `అన్నగారు` టైటిల్ పెడితే.. బాలయ్య మొగ్గు చూపించాడని టాక్ నడుస్తోంది. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. టైటిల్ ను అధికారంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందట.
Also Read: Ram Pothineni: స్టార్ హీరోల రేంజ్ ని దాటేసిన హీరో రామ్.
కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమకి సాగునీటి విషయంలో జరుగుతున్న ఆన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపిస్తారట. ఇక బాలయ్యకి జోడీగా శ్రుతి హాసన్ నటించబోతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తోంది. లావు పెరగడానికి తన డైట్ ను మార్చుకుంది.
నిజానికి శృతి హాసన్ కి జీరో సైజ్ అంటేనే ఎక్కువ మక్కువ. కానీ బాలయ్య సినిమా కోసం పూర్తిగా వర్కౌట్స్ మానేసింది. బాలయ్య కోసం సరికొత్త లుక్ లో కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమెది ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్ర. ఆ పాత్రలో బాలయ్య భార్యగా శృతి హాసన్ నటించబోతుంది. ఏది ఏమైనా అరవై ఏళ్ల వయసులో బాలయ్య క్రేజ్ డబుల్ అయింది.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. పైగా చాలా విషయాల్లో బాలయ్య నిర్మాతలకు మంచి లాభదాయకం. రెమ్యునరేషన్ ఎక్కువ ఉండదు. డిమాండ్స్ కూడా పరిధికి మించి దాటవు. ఏ రకంగా చూసుకున్న బాలయ్యతో సినిమా సేఫ్ ప్రాజెక్ట్.
Also Read:Sarkaru Vaari Paata Distributors: అయోమయంలో పడ్డ సర్కారు వారి పాట మూవీ డిస్ట్రిబ్యూటర్లు
Recommended Videos
[…] […]