నటసింహం నందమూరి బాలకృష్ణ సరికొత్త లుక్కులో అదరగొడుతున్నారు. ఆయన లుక్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనగా దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. గుబురు మీసాలు, బారుగడ్డం, గుండుతో ఉన్న ఆయన గెటప్ సరికొత్తగా ఉంది. ఈ లుక్ తోనే బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం బాలయ్య 106వ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘సింహా’, ‘లెజెండ్’ మూవీల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ఈమూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈనెలలో రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కావాల్సిండగా కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
ఈ మూవీలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్స్ కేస్తున్నారు. తొలిసిరా బాలయ్య బాబు అఘోరా కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను వారణాసిలో తీసేందుకు సన్నహాలు చేస్తున్నారు. మరో పాత్ర రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. ఈ మూవీలో బాలయ్య సరసన అంజలి నటిస్తుంది. బాలయ్యతో అంజలి గతంలో డిక్టేటర్ మూవీలో నటించి మెప్పించింది. బాలయ్య న్యూ గెటప్ అదిరిపోవడంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Balakrishna new look goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com