OG Movie : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ఓజీ(They Call Him OG). సుజిత్(Director Sujeeth) దర్శకత్వం లో మొదలైన ఈ సినిమా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2023 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఇది కదా పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ అంటూ ఇతర హీరోల అభిమానులు సైతం ప్రశంసించారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఇన్ని రోజులు నిర్మాతలకు దొరకలేదు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి తన సినిమా షూటింగ్స్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు.
Also Read : బాలయ్య, క్రిష్, మోక్షజ్ఞ కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ ఫిక్స్..ముహూర్తం ఎప్పుడంటే!
నిన్నటి నుండి ఆయన ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆయన పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. రేపు సాయంత్రం తో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యినట్టే. వచ్చే వారం నుండి ఆయన ఓజీ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నాడట. హైదరాబాద్ లో ఆ సినిమా కోసం వేసిన సెట్స్ లో కొన్ని రోజులు షూటింగ్ చేయబోతున్నారట. ఆ తర్వాత అమరావతి లో పది రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ నెలాఖరు లోపు ఓజీ మూవీ షూటింగ్ ని పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఈ వార్త సోషల్ మీడియా లో రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
బ్యాక్ టు బ్యాక్ ఆయన తానూ కమిట్ అయిన ఈ మూడు సినిమాలను పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట. నిన్ననే డైరెక్టర్ హరీష్ శంకర్ ని పిలిపించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రిప్ట్ స్టేటస్ ని అడిగి తెలుసుకున్నాడట. జూన్ నెల నుండి ఆ సినిమా షూటింగ్ కి కూడా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. నెలాఖరున కాకపోతే, వచ్చే నెల 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ‘ఓజీ’ విషయానికి వస్తే సెప్టెంబర్ 5 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. జూన్ మూడవ వారం నుండి నాన్ స్టాప్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వబోతున్నారు మేకర్స్. జూన్ నెలలో విడుదల తేదీని ప్రకటించి, మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారట.