Balakrishna Lion Bag: సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. హై కల్చర్డ్ సొసైటీలో బ్రతుకుతారనే కానీ మూఢ నమ్మకాలు ఫాలో అవుతారు. పూజలు, పునస్కారాలు చేస్తారు. స్వామీజీలను నమ్మడం. వాళ్ళిచ్చే తాయత్తులు, ఉంగరాలు ధరించడం చేస్తారు. ఈ విషయంలో బాలకృష్ణ అందరికంటే ముందు వరసలో ఉంటాడు. ఆయన రెండు చేతులకు, మెడలో తాయత్తులు ఉంటాయి. పది వేళ్ళకు రంగురాళ్ల ఉంగరాలు ఉంటాయి. అలాగే ఆయన సెంటిమెంట్స్ విపరీతంగా నమ్ముతాడు.
బాలకృష్ణకు సింహ పేరు అంటే ఎనలేని సెంటిమెంట్. తన సినిమా టైటిల్ తో సింహ ఉంటే ఆల్మోస్ట్ హిట్ అని భావిస్తాడు. చాలా సందర్భాల్లో ఆయన నమ్మకం నిజమైంది కూడా. బొబ్బిలి సింహం, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, వీరసింహారెడ్డి చిత్రాలు ఆయనకు మరపురాని విజయాలు అందించాయి. ఇక బాలయ్య టైటిల్స్ లోనే కాదు వాడే వస్తువుల్లో కూడా సింహం ఉండేలా చూసుకుంటున్నాడు.
తాజాగా బాలయ్య ఎయిర్ పోర్టులో సింహం బొమ్మతో కూడిన బ్యాగ్ తగిలించుకుని కనిపించాడు. అది విపరీతంగా ఫ్యాన్స్ ని ఆకర్షించింది. ఒక సింహం మరో సింహాన్ని భుజాన వేసుకుని వెళుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఆ బ్యాగ్ ధర ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఆ లయన్ బ్యాగ్ ధర రూ. 25 వేలు అని సమాచారం. అయితే 37% డిస్కౌంట్ తో బాలయ్య రూ. 15,689 కి కొనుగోలు చేశాడట.
అంత చిన్న బ్యాగ్ కి వేల రూపాయలు వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు కద. సెలెబ్రెటీలకు విలువైన వస్తువులు వాడటం అలవాటు. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న బాలయ్యకు 15 వేలు ఆఫ్ట్రాల్ కదా. ఇక అఖండ, వీరసింహారెడ్డి చిత్ర విజయాలతో బాలకృష్ణ జోరు మీదున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి విడుదలకు సిద్ధం అవుతుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రంలో కీలక రోల్ శ్రీలీల చేస్తున్నారు. దసరా కానుకగా భగవంత్ కేసరి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణా నేపథ్యంలో సాగే ఈ కథలో బాలకృష్ణ వైవిధ్యంతో కూడా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.