Bigg Boss 7 Telugu Day 23: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగవ వారం నామినేషన్స్ ముగిసాయి. సోమవారం ప్రారంభం అయిన నామినేషన్ ప్రాసెస్ మంగళవారంతో పూర్తయింది . ఈ నామినేషన్ ప్రక్రియ పోటా పోటీగా సాగింది . ఎన్నడూ లేని విధంగా ఈ వారం నామినేషన్స్ జరిగాయి . బిగ్ బాస్ ఇంటిని కోర్టు గా మార్చి, ఇంటి సభ్యులుగా మారిన సుందీప్ ,శివాజీ ,శోభా శెట్టి లను జడ్జీలుగా నియమించాడు. ట్విస్ట్ ఏంటి అంటే కంటెస్టెంట్స్ తాము నామినేట్ చెయ్యాలి అనుకున్నఇద్దరిని బోన్ లో నిలబెట్టి తగిన కారణాలు చెప్పి జ్యూరీ సభ్యులను మెప్పించాల్సి ఉంటుంది . జ్యూరీ మెంబెర్స్ కరెక్ట్ రీజన్ అనిపించిన వారి ఫోటో ని గిల్టీ బోర్డు పై పెట్టి వారిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు .
కంటెస్టెంట్స్ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకుంటూ ఫైర్ పుట్టించారు . ఒకరినొకరు తిట్టుకుంటూ ,వాదించుకుంటూ రెచ్చిపోయారు . యావర్ ,గౌతమ్ మధ్య గొడవ హైలైట్ అయింది . నువ్వెంత నువ్వెంత అనుకుంటూ ఇమిటేట్ చేసుకున్నారు . ఇద్దరు కొట్టుకుంటారేమో అనిపించేంతగా పైపైకి వెళ్లారు . గౌతమ్, శివాజీ పై ఫుల్ ఫైర్ అయ్యాడు . కోపం కంట్రోల్ చేసుకోలేక బూతులు తిట్టాడు .
మొత్తనికి ఈ నామినేషన్స్ ఫైవ్ రౌండ్స్ లో పూర్తయింది . ఐదు రౌండ్స్ కు గాను ఫైవ్ మెంబెర్స్ ని లిస్టులో చేర్చారు జ్యూరీ సభ్యులు. ప్రియాంక ,రతిక , ప్రిన్స్ యావర్ , గౌతమ్ కృష్ణ , శుభ శ్రీ ఈ లిస్ట్ లో వున్నారు . ఇప్పుడే బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఇస్తాడు . నామినేషన్స్ లో లేని ఒక సభ్యుడిని మీ పవర్ ఉపయోగించి నామినేట్ చెయ్యాలని చెప్పాడు . ప్రశాంత్, అమరదీప్ ,తేజ సేఫ్ గా ఉన్నారు .
తేజాని నామినేట్ చేద్దాం అని సుందీప్ ,శివాజీ చెప్తారు . శోభా మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన తేజకి సపోర్ట్ చేస్తూ కాపాడాలని ట్రై చేసింది ,కానీ ఏకాభిప్రాయం తో తేజా పేరు చెప్పారు జ్యూరీ సభ్యులు . ఇక నామినేట్ అయిన సభ్యుల లిస్ట్ చూస్తే… ప్రియాంక జైన్ ,రతిక రోజ్ ,ప్రిన్స్ యావర్ ,గౌతమ్ కృష్ణ , శుభ శ్రీ ,తేజ లిస్ట్ లో ఉన్నారు . దీంతో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది . వీరిలో టేస్టీ తేజా వీక్ అనిపిస్తుండగా… అతడు ఎలిమినేట్ కావచ్చనే వాదన మొదలైంది.