TS TET Result 2023: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS టెట్ 2023)ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. టెట్ ఫలితాలను https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా తెలుసుకోవడంతో పాటు అభ్యర్థులు స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1 కు సంబంధించి 2.26 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 2 కు సంబంధించి 1.90 లక్షల మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ టెట్ అర్హత కాలపరిమితి జీవిత కాలం ఉంటుంది. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు. పేపర్ 2 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు.
తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చేనెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మొత్తం 5089 పోస్టులకు సంబంధించి డీఎస్సీ నియామక ప్రక్రియ జరగనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, పీఈటి పోస్టులకు సంబంధించి భర్తీ చేపట్టనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త రాష్ట్ర పద్ధతి ప్రకారం నియామక ప్రక్రియ జరపనున్నారు. ఫలితంగా కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి రానుంది. కాగా తాజాగా ప్రకటించిన ఫలితాలకు సంబంధించి 20 మార్కులను వెయిటేజీ ఇవ్వనున్నారు.