https://oktelugu.com/

Royal Enfield : రాయల్ ఎన్ ఫీల్డ్ లవర్స్.. రెడీగా ఉండండి.. నేడే కొత్త బైక్.. ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయంటే?

రాయల్ ఎన్ ఫీల్డ్ 350 అప్డేట్ బైక్ లో అప్డేట్ ఫీచర్స్ కనిపిస్తాయి. ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ సహా కొన్ని ఫీచర్లు సవరించారు. మోడ్రన్ క్లాసిక్ తో పాటు లైన ప్ ను సవరించారు. టాప్ అండ్ క్లాసిక్ 350లో ట్రిపర్ నావేగేషన్ పాడ్ ను కొత్త తరహాలో తయారు చేశారు. అయితే ఇందులో భారీ మార్పులు ఏం చేయలేదు. జే సిరీస్ కలిగిన 349 సీసీ సింగిల్ సిలిండర్ ను అమర్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 11, 2024 / 12:09 PM IST
    Follow us on

    Royal Enfield : బైక్ నడిపే వారికి గుడ్ న్యూస్. అందులోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ కావాలని చూస్తున్న వారికి కంపెనీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇప్పిటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వాటికి కొనసాగింపుగా ఇప్పుడు కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. అదీ సోమవారం లాంచ్ చేయనున్నారు. ఇప్పటి వరకే ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ 350ని అప్డేట్ వెర్షన్ ను ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మిగతా బైక్ లకు గట్టి పోటీ ఇచ్చే విధంగా దీనిని తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. స్టైలిష్ లుక్ తో యూత్ ను బాగా ఆకర్షించే విధంగా ఉన్న రాయల్ ఎన్ పీల్డ్ అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. దీంతో దీని కొత్త వెర్షన్ లో తొందర్లోనే రాబోతుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త వెర్షన్ బైక్ ఎలా ఉండబోతుందంటే?

    రాయల్ ఎన్ ఫీల్డ్ 350 అప్డేట్ బైక్ లో అప్డేట్ ఫీచర్స్ కనిపిస్తాయి. ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ సహా కొన్ని ఫీచర్లు సవరించారు. మోడ్రన్ క్లాసిక్ తో పాటు లైన ప్ ను సవరించారు. టాప్ అండ్ క్లాసిక్ 350లో ట్రిపర్ నావేగేషన్ పాడ్ ను కొత్త తరహాలో తయారు చేశారు. అయితే ఇందులో భారీ మార్పులు ఏం చేయలేదు. జే సిరీస్ కలిగిన 349 సీసీ సింగిల్ సిలిండర్ ను అమర్చారు. ఇది 20.2 బీహెచ్ పీ పవర్, 27 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 41 ఎంఎం టెలిస్కోస్ తో కూడిన ట్విన్ డౌన్ ట్యూబ్ ను అమర్చారు. డ్యూయెల్ ఛానెల్ ఏబీసీతో 270 ఎంఎం రేర్ డిస్క్, 153 మీమీ డ్రమ్ బ్రేక్ తో ఉన్న సింగిల్ ఛానల్ ఏబీఎఉస్ ఆప్షన్ ఇందులో కనిపిస్తుంది.

    ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ 350 బైక్ ని 2.25 లక్షల వరకు విక్రయిస్తున్నారు. తాజా బైక్ ధర పెరిగే అవకాశం ఉంది. దీనిని క్లాసిక్ 350 బాబర్ బైక్ అని నామకరణం చేశారు. ఇందులో 350 సీసీ ఇంజిన్ ఉండి మెరుగైన సీటింగ్ ఉటుందని అంటున్నారు. ఎల్ ఈడీ టర్న్ ఇండికేటర్లతో బైక్ ఆకర్షిస్తుంది. దీనిని ఆగస్టు 12న మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే ధర విషయం క్లారిటీ ఇవ్వనప్పటికీ రూ. 3లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖరీదైన బైక్ పై స్లైలిష్ గా డ్రైవ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

    రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లకు దశాబ్దాలుగా గుర్తింపు ఉంది. దీనిని డ్రైవ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ కంపెనీ ఎప్పటికప్పుడు లేటేస్ట్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది.ఈ ఏడాది మే నెల లెక్కల ప్రకారం.. ఈ కంపెనీకి చెందిన 7 మోడళ్లు అత్యధికంగా అమ్ముడు పోయాయి. వీటిలో 4 మోడళ్లు వార్షికంగా అమ్మకాలు క్షీణించాయి. 3 మోడళ్లు వృద్ధి సాధించాయి. వీటిలో క్లాసిక్ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంది. ఆ నెల మేలో దీనిని 23,779 మంది సొంతం చేసుకున్నారు. ఆ తరువాత అమ్మకాలు క్షీణించాయి. అయితే కొత్త బైక్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.