Balakrishna And NTR: నందమూరి నటసింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే అయితే క్రియేట్ అవుతాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టాయి. మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండటం విశేషం… ఇక బాలయ్య బాబు నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో టాప్ హీరోగా సక్సెస్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను తన భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నాడు. అయితే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని కొట్టాడు అంటూ కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
నిజానికి బాలయ్య ఎన్టీఆర్ ను కొట్టినప్పటికి అది ఇప్పుడు కాదట. ఎన్టీఆర్ చిన్నతనంలో బాలయ్య సినిమా షూటింగ్లోకి వచ్చేవాడట. అప్పుడు సెట్ లో అల్లరి చేస్తుంటే బాలయ్య ఒకటి రెండు సార్లు మందలించారట. అయిన కూడా ఎన్టీఆర్ వినకపోవడంతో ఎన్టీఆర్ ను కొట్టి పక్కన కూర్చో పెట్టాడట. మొత్తానికైతే అప్పట్లోనే బాబాయి అబ్బాయి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది.
ఆ బాండింగ్ తోనే ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా బాలయ్య బాబు తనకు చాలా వరకు సపోర్టుగా నిలిచాడు. ప్రస్తుతం వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఇక ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్య మాటలు కలిసి మరోసారి నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళు మరింత కృషి చేయాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు…
ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి సినిమాలు కూడా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…