Balakrishna Gopichand Malineni: వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ తో సీనియర్ హీరోలలో ఎవ్వరూ చూడనంత సక్సెస్ ని చూసి ,యూత్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య(Nandamuri Balakrishna) స్పీడ్ కి ‘అఖండ 2’ చిత్రం పెద్ద బ్రేక్ వేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాలయ్య గత సినిమాల ద్వారా ఆడియన్స్ లో సంపాదించుకున్న మంచి పేరు కారణంగా వీకెండ్ వరకు మంచి వసూళ్లను రాబట్టింది. కానీ ఆ తర్వాత మాత్రం వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ దారుణంగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని కనిపించనంత దూరం లోనే ఆగిపోయేలా అనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ అవ్వడం మాత్రమే కాదు, బాలయ్య లోని అద్భుతమైన నటనను మరోసారి బయటకు తీసి చూపింది ఈ చిత్రం. ముఖ్యంగా గోపీచంద్ పెద్ద బాలయ్య ని చూపించిన విధానం కి నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా మంత్రముగ్దులు అయిపోయారు. అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే ఇప్పటి వరకు కేవలం మాస్ కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమైన గోపీచంద్ మలినేని , మొదటిసారి పీరియడ్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఇది రాజుల కాలం నాటి కథ. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించబోతుంది. గతం లో ఆమె బాలయ్య తో కలిసి సింహా, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలు చేసింది.
మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య తో ఈ సినిమా చేయబోతుంది. ఈ చిత్రానికి ‘మహారాజు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతటి భారీ స్కేల్ సినిమాకు ఇంత సింపుల్ టైటిల్ పెట్టడం ఏంటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మహారాజు కి బదులుగా, సింహా అని వచ్చేటట్టు వేరే ఏదైనా పవర్ ఫుల్ టైటిల్ పెట్టమని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ రిక్వెస్ట్ ని గోపిచంద్ మలినేని పరిగణలోకి తీసుకుంటాడా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.