Telugu News » India » Aditya thakre son of maharshtra cm in soup
సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆదిత్య థాకరే?
సినిమా హీరో సుశాంత్ సింగ్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇంతవరకు ప్రత్యక్షంగా పేరు చెప్పటానికి జంకుతున్న చానళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆదిత్య థాకరే పేరు తెర మీద స్క్రోల్ చేస్తున్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్ని కూడా మలుపు తిప్పుతిందనటం లో ఎటువంటి సందేహం లేదు. అంత ధైర్యంగా స్క్రోల్ చేయటానికి కారణం సుప్రీం కోర్టులో బీహార్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్. అందులో స్పష్టంగా ఈ కేసులో ఆదిత్య థాకరే పేరు వినిపిస్తుంది కాబట్టి […]
సినిమా హీరో సుశాంత్ సింగ్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇంతవరకు ప్రత్యక్షంగా పేరు చెప్పటానికి జంకుతున్న చానళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆదిత్య థాకరే పేరు తెర మీద స్క్రోల్ చేస్తున్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్ని కూడా మలుపు తిప్పుతిందనటం లో ఎటువంటి సందేహం లేదు. అంత ధైర్యంగా స్క్రోల్ చేయటానికి కారణం సుప్రీం కోర్టులో బీహార్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్. అందులో స్పష్టంగా ఈ కేసులో ఆదిత్య థాకరే పేరు వినిపిస్తుంది కాబట్టి ముంబై పోలీసులు నిస్పక్షపాతం గా దర్యాప్తు చేయలేరని అభిప్రాయపడింది. దీనితో చానళ్ళకు ఎటువంటి ఇబ్బందిలేకుండా స్క్రోల్ చేయగలుగుతున్నారు. ఇప్పటికే ఎ యు కోడ్ నేమ్ పేరుతో చాటింగ్ లో ఉండటంతో డొంకతిరుగుడుగా ఇన్నాళ్ళు ఒక మంత్రి కొడుకు అని ప్రసారం చేస్తున్న చానళ్ళు ఒక్కసారి ఆదిత్య థాకరే పేరు ప్రచారం చేయటం తో మహారాష్ట్ర రాజకీయాలు పెద్ద మలుపు తిరిగాయనే చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అవేమిటో చూద్దాం.
ఇప్పటికి 56 రోజులు దాటినా ముంబై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయలేదు. అసలు కేసు ఆత్మహత్య లేక హత్య అనేది ప్రకటించలేదు.
ఇంతవరకు మేజిస్ట్రేట్ ముందు నివేదిక ప్రవేశపెట్టలేదు.
ఎటువంటి సాక్ష్యాలు సేకరించిన దాఖలాలు లేవు.
పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రత్యక్ష సాక్షులు ఇవ్వటం కూడా అనుమానాలకు తావిస్తుంది.
ప్రధాన అనుమానితురాలు రియా చక్రవర్తి ని ఇంతవరకు రిమాండ్ లోకి తీసుకోలేదు.
సుశాంత్ సింగ్ తండ్రి తమ అబ్బాయి కి రక్షణ కల్పించమని చేసిన విజ్ఞప్తి ని డి ఎస్ పి పెడచెవిన పెట్టాడు.
బీహార్ పోలీసులు విచారణకు వస్తే సహకరించక పోగా క్వారంటైన్ పేరుతో నిర్బంధం లో ఉంచారు.
సుశాంత్ సింగ్ మేనేజర్ దిశా ఇలియన్ ఆత్మహత్య పై కూడా అనేక అనుమానాలున్నాయి.
బీహార్ ప్రభుత్వ అభ్యర్ధనపై సి బి ఐ విచారణ చేపట్టింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కెళ్ళింది. దీనిపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరచ నుంది.
ఇప్పటికే మహారాష్ట్ర వికాస్ అగది కూటమి లో ఎన్నో లుకలుకలున్నాయి. ఈ కేసుతో అవి మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విలయతాండవం తో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. ఈ ఘటన తో పూర్తిగా దెబ్బతగిలింది. దీన్నుంచి బయటపడటానికి ప్రాంతీయ విద్వేషాలు శివసేన రెచ్చగొడుతుంది. ఇదంతా ఎన్నికల కోసం బీహార్ ప్రభుత్వం కుట్ర పన్నిందని చెబుతుంది. కానీ పాత రోజుల్లో లాగా ఈ చిట్కాలు పనిచేయక పోవచ్చు. ఈ కేసులో ప్రభుత్వ ఒత్తిడి వుందని ప్రజలు నమ్ముతున్నారు. ఏ ఒత్తిడి లేకపోతే ముంబై పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా వున్నారని అందరికీ సందేహమొస్తుంది. ఒకవేళ ఆదిత్య థాకరే కాకపోతే ప్రభుత్వం లో ఇంకెవరు ముంబై పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలి కదా. దీనితో శివసేన పని గోవిందా అని జనం అంటున్నారు. అది నిజమేననిపిస్తుంది.