Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన ‘అఖండ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు బాలయ్య మజిల్ ఇంజూర్ అయింది. అతని మజిలీకి సర్జరీ చేసిన డాక్టర్లు తను ఒక నెల రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం బాలయ్య రెస్టులో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రెస్టు పూర్తయిన తర్వాత తను సినిమా షూటింగ్లో పాల్గొని శరవేగంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు సినిమా చేయాలంటే ఇద్దరు పక్కాగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందులో ఒకరు తన కూతురు తేజస్విని కాగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కావడం విశేషం… వీళ్లిద్దరూ లేకుండా తను సినిమా చేసే అవకాశం లేదనెంత రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు. ఏదైనా కథ తన దగ్గరికి వస్తే తన కూతురు తేజస్వినికి చెప్పి ఆ కథను ఫైనల్ చేయించే బాధ్యత మొత్తం తనకే అప్పజెప్తున్నాడు.
ఇక సినిమా మ్యూజిక్ విషయంలో తమన్ కి ఫుల్ బాధ్యతలను ఇచ్చేసి పాటల విషయంలో కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గానీ తమన్ మొత్తం చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళిద్దరే బాలయ్య బాబు సినిమాల్లో కీలకపాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. వరుసగా నాలుగు విజయాలను సాధించడానికి వీళ్ళిద్దరు చాలా కీలకపాత్ర వహించారు.
కొంతవరకు ప్రేక్షకులను మెప్పించకపోయిన కూడా అటు తేజస్విని ఇటు తమన్ ఇద్దరు కూడా తమ బాధ్యతను సక్సెస్ ఫుల్ గా కొనసాగించారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు సినిమాలు సక్సెస్ అవ్వడంలో వీళ్ళ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. అందుకే బాలయ్య వీళ్లిద్దరు లేకుండా అసలు సినిమా చేసే ప్రసక్తే లేదు అని చెబుతున్నట్టుగా తెలుస్తుంది…







